వైరల్‌ : దున్న భలే తప్పించుకుంది | Lions Breaks Out In Fight After Dragging Buffalo To Eat Became Viral | Sakshi
Sakshi News home page

దున్న భలే తప్పించుకుంది

Sep 3 2019 7:29 PM | Updated on Sep 3 2019 7:37 PM

Lions Breaks Out In Fight After Dragging Buffalo To Eat Became Viral - Sakshi

నోటిదాకా అందివచ్చిన ఆహారాన్ని చేజేతులా పోగోట్టుకోవడం అంటే ఇదేనేమో.. తమలో తమకే ఐక్యత లేకపోవడం వల్ల సింహాల గుంపుకు నిరాశే ఎదురైంది. వాటికి ఆహారంగా దొరికిన ఓ దున్న తెలివిగా అక్కడి నుంచి జారుకుంది. ఈ వింత ఘటన దక్షిణాఫ్రికాలోని క్రూగర్‌ నేషనల్‌ పార్క్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఓ సింహాల గుంపు ఒంటరిగా ఉన్న దున్నను వేటాడింది. వాటికి చిక్కిన ఆ దున్నను ఎంచక్కా తినకుండా మాంసం కోసం వాటంతట అవే కొట్టుకోవటం ప్రారంభించాయి. ఇదే అదనుగా భావించిన ఆ దున్న అక్కడి నుంచి మెల్లగా జారుకుంది. కాగా, ఈ వీడియోనూ భారత్‌కు చెందిన పర్వీన్‌ కశ్వన్‌ అనే ఐఎఫ్‌ఎస్‌ అధికారి ట్వీటర్‌లో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. తెలివితక్కువ సింహాలకు ఇది మంచి గుణపాఠమని, సింహాల నుంచి తెలివిగా తప్పించుకున్న దున్నను అందరూ మెచ్చుకుంటున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement