చీలిన లష్కరే తోయిబా; జైషే మన్కాఫా ఏర్పాటు | Lashkar-e-Taiba split into two | Sakshi
Sakshi News home page

చీలిన లష్కరే తోయిబా; జైషే మన్కాఫా ఏర్పాటు

Mar 12 2018 2:40 PM | Updated on Mar 13 2018 9:07 AM

 Lashkar-e-Taiba split into two - Sakshi

హఫీజ్‌ సయీద్‌, జైషే మన్కాఫా వ్యవస్థాపకుడు మౌలనా అమీర్‌ హంజా

ఇస్లామాబాద్‌ : ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. హఫీజ్‌ సయీద్‌ కార్యకలాపాలపై నిఘా తీవ్రతరం కావడంతో సంస్థ డిప్యూటీ మౌలనా అమీర్‌ హంజా.. కొత్త కుంపటికి తెరలేపారు. ‘జైషే మన్కాఫా’ పేరుతో మౌలానా కొత్త సంస్థను స్థాపించినట్లు పాక్‌ మీడియా పేర్కొంది.ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకే హఫీజ్‌ ఈ ఎత్తుగడ వేసి ఉంటాడని తెలుస్తోంది. హఫీజ్‌ నిర్వహిస్తున్న సంస్థలను సీజ్‌ చేసిన పాక్‌ సర్కారు.. ఆయన ఏర్పాటు చేయాలనుకున్న రాజకీయ పార్టీకి కూడా అనుమతి నిరాకరించింది. కాగా, కొత్త సంస్థ తన ఉనికిని చాటేందుకు జమ్మూకశ్మీర్‌లో దాడులకు తెగబడొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement