అచ్చిరాకుంటే.. అంతే... | Lalu Prasad Yadav is shifting his swimming | Sakshi
Sakshi News home page

అచ్చిరాకుంటే.. అంతే...

Mar 11 2014 6:43 AM | Updated on Sep 2 2017 4:35 AM

అచ్చిరాకుంటే.. అంతే...

అచ్చిరాకుంటే.. అంతే...

ఆలూ ఉన్నంతవరకూ లాలూ ఉంటాడని చెప్పుకునే ఈయనకు ఈ మధ్య కష్టాలు ఫ్యామిలీ ప్యాకేజీలాగా ఒకదానివెంట ఒకటి చుట్టుముట్టాయి.

ఆలూ ఉన్నంతవరకూ లాలూ ఉంటాడని చెప్పుకునే ఈయనకు ఈ మధ్య కష్టాలు ఫ్యామిలీ ప్యాకేజీలాగా ఒకదానివెంట ఒకటి చుట్టుముట్టాయి. దాణా స్కామ్‌లో జైలుకు వెళ్లడం.. రాజకీయంగా కష్టాలు, నష్టాలు ఇలా అన్నీ ఒకేసారి మీద పడ్డాయి. ఇంతకీ లాలూప్రసాద్‌కు ఇన్ని ఇక్కట్లెందుకు వచ్చాయో తెలుసా? స్విమ్మింగ్ పూల్ వల్ల!
 
 అవును. స్విమ్మింగ్ పూల్ వల్లే.. ఆ విషయాన్ని ఆయనకు నమ్మకస్తుడైన వాస్తు నిపుణుడు చెప్పాడు. స్విమ్మింగ్ పూల్ ప్రస్తుతం ఉన్నచోటు సరైనది కాదని చెప్పడంతో పాట్నాలోని తన బంగ్లాలో భార్య రబ్రీదేవి ఛాత్ పూజ కోసం ఎంతో ఇష్టంగా కట్టించిన ఈతకొలనును ఇలా మట్టితో పూడ్పించేశారు. అంతేకాదు.. కష్టాలన్నీ పోయి.. కాలం కలిసొచ్చేలా చేయడానికి.. బంగ్లాలోని ఈశాన్య దిశలో మరో కొత్త ఈతకొలనును త్వరలోనే నిర్మించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement