లాడనే మా హీరో: పాక్‌ మాజీ అధ్యక్షుడు

Laden Was Pakistans Hero Says By Pervez Musharraf  - Sakshi

ఇస్లామాబాద్‌ : కరడుగట్టిన ఉగ్రవాది ఒసామా బిన్‌ లాడెన్‌ తమ హీరో అని పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే విషయంలో పాకిస్తాన్‌ వైఖరిని ముషార్రఫ్‌ బహిర్గతం చేశారు. జిహాది ఉగ్రవాదులందరు పాక్‌ హీరోలంటూ కొనియాడారు. ఈ మేరకు ముషారప్‌ వ్యాఖ్యానించినట్లుగా పాక్‌ రాజకీయ నాయకుడు ఫర్‌హతుల్లా బాబర్‌ ట్విట్టర్‌లో ఓ వీడియోను షేర్‌ చేశారు. వీడియో ప్రకారం.. పాకిస్తాన్‌కు లాభం చేకూర్చే విధంగా ఆఫ్ఘనిస్తాన్‌లో 1979లో మతపరమైన మిలిటెన్సిని ప్రవేశపెట్టామని తద్వారా దేశంలోని సోవియేట్లను వెళ్లిపోయే విధంగా కృషి చేశామని ముషారఫ్‌ అన్నారు.
 

‘ప్రపంచంలోని ముజాహిద్దీన్‌ ఉగ్రవాదులందరిని ఏకం చేశాం. అప్పట్లో లష్కరే తోయిబా, ఆల్‌ఖైదా ఉగ్రవాదులను ప్రోత్సహించాం. పాక్‌కు వచ్చే కశ్మీరీలను హీరోలుగా గుర్తించాం. మేము వారికి పటిష్టమైన శిక్షణ ఇచ్చాం. భారత ఆర్మీతో పోరాడే కశ్మీరులను ముజాహుద్దీన్‌లుగా గుర్తించాం. అంతర్జాతీయంగా పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల తమ హీరోలు విలన్లయ్యారు’ అని ముషారఫ్‌ వ్యాఖ్యానించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top