
ప్రతి 10 డాలర్లకు ఒక న్యూడ్ ఫొటోను పంపిస్తానని అన్నారు.
ఆస్ట్రేలియాలో కార్చిచ్చు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. లక్షల హెక్టార్లలో మంటలు వ్యాపించడంతో.. చెట్లు, పంటలు అగ్నికి ఆహుతయ్యాయి. మంటలను అదుపు చేయడానికి అధికార యంత్రాంగం తీవ్రంగా యత్నిస్తోంది. అలాగే ఆస్ట్రేలియాకు సాయంగా నిలిచేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన సోషల్ మీడియా సెలబ్రిటీ కైలెన్ వార్డ్.. ఆస్ట్రేలియా విపత్తుకు సాయంగా విరాళాలు సేకరించడానికి వినూత్న పద్ధతిని ఎంచుకున్నారు. విరాళాలు అందించేవారికి తన న్యూడ్ ఫొటోలను పంపుతానని తెలిపారు. ఆస్ట్రేలియాలో కార్చిచ్చుకు సంబంధించి విరాళాలు సేకరిస్తున్న సంస్థలకు కనీసం 10 డాలర్లు విరాళం అందజేసినట్టు తనకు నిర్దారణ చేస్తే.. వారికి తన న్యూడ్ ఫొటోలను పంపుతానని వెల్లడించారు. ప్రతి 10 డాలర్లకు ఒక న్యూడ్ ఫొటోను పంపిస్తానని అన్నారు.
కైలెన్ పిలుపుకు విశేషమైన స్పందన వచ్చింది. చాలా మంది వారు పంపిన విరాళాలకు సంబంధించిన మేసేజ్‌లకు ఆమెకు షేర్ చేశారు. తన పిలుపుతో దాదాపు 700 వేల డాలర్లు(రూ. 5 కోట్లకు పైగా) విరాళాలు సేకరించగలిగానని ఆమె పేర్కొన్నారు. అయితే కైలెన్ విరాళాలు సేకరిస్తున్నట్టు ప్రకటించిన వెంటనే ఇన్‌స్టాగ్రామ్.. ఆమె అకౌంట్‌ను డీ ఆక్టివేట్ చేసింది. దీంతో ఆమె మరో అకౌంట్‌ను ప్రారంభించగా.. దానిని కూడా అందుబాటులో లేకుండా చూసింది. మరోవైపు కైలెన్ చేపట్టిన విరాళాలకు సంబంధించి.. కొంత డబ్బును ఆమె సొమ్ము చేసుకుంటందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే వాటిపై ట్విటర్‌లో ఆమె స్పందిస్తూ.. ‘నేను విరాళాలను సొమ్ము చేసుకుంటున్నానని అనడంలో వాస్తవం లేదు. ప్రతి ఒక్కరు వారికి ఇష్టమైన చారిటీకి గానీ, సంస్థకు గానీ విరాళాలు అందజేస్తున్నారు. నాకు కేవలం అందుకు సంబంధించిన కన్ఫర్మేషన్‌ను పంపిస్తున్నార’ని స్పష్టం చేశారు.
చదవండి :
చెలరేగిన మంటలు.. భయంతో పరుగులు