పెద్ద సూపర్‌ మార్కెట్‌.. ఎక్కడ చూసినా ఎలుకలే | Japans Family Mart convenience chain Apologies for Rats in Store | Sakshi
Sakshi News home page

పెద్ద సూపర్‌ మార్కెట్‌.. ఎక్కడ చూసినా ఎలుకలే

Aug 8 2019 4:11 PM | Updated on Aug 8 2019 5:10 PM

Japans Family Mart convenience chain Apologies for Rats in Store - Sakshi

టోక్యో : జపాన్‌లోని ఓ సూపర్‌ మార్కెట్‌లో ఎలుకలు స్వైర విహారం చేస్తున్న వీడియో తాజాగా సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. సూపర్‌ మార్కెట్‌ మూసేశాక ఓ వ్యక్తి బయట నుంచి ఈ వీడియోను తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. ‘స్టోర్‌లో పగలు కస్టమర్లు తిరిగినంత స్వేచ్ఛగా.. ఈ టైమ్‌లో ఎలుకలు సంచరిస్తున్నాయి. ఇక్కడే ఇన్ని ఉంటే స్టోర్‌ మొత్తం ఇంకా ఎన్ని ఉన్నాయో’ అంటూ ఓ సందేశాన్ని కూడా జత చేశాడు. ఇప్పటివరకు దాదాపు 5 మిలియన్లకు పైగా నెటిజన్లు ఈ వీడియోను వీక్షించారు.

సరేలే ఇదేదో చిన్న స్టోర్‌ అనుకుంటే పోరపాటే. ఎందుకంటే.. ఈ స్టోర్‌ ఆసియా వ్యాప్తంగా వేల సంఖ్యలో బ్రాంచ్‌లు గల ఫ్యామిలీ మార్ట్‌ సంస్థకు చెందినది. ఈ వీడియో వైరల్‌గా మారడంతో.. నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. దీంతో షిబుయా జిల్లాలో గల ఈ దుకాణాన్ని మూసివేసినట్లు ఫ్యామిలీ మార్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే వినియోగదారులకు క్షమాపణ తెలిపింది. స్టోర్‌లోని ఎలుకలను పూర్తిగా తొలగిస్తామని, వస్తువులను కూడా తీసివేస్తామని ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement