ఆ ఒక్క గది మాత్రం రూ.66కే

Japan Hotel Offers Room For Rs 66 Only Per Night - Sakshi

టోక్యో: జపాన్‌లోని ఓ హోటల్‌ వినూత్న ఆలోచన చేసింది. ఆ ఆలోచన కాస్తా వర్కవుట్‌ అవడంతో హోటల్‌కు జనాలు క్యూ కడుతున్నారు. వివరాలు.. జపాన్‌లోని అసాహి ర్యోకాన్‌ హోటల్‌లోని గదిలో ఒక రాత్రి బస చేయాలంటే 100 యెన్‌లు చెల్లిస్తే చాలు. దేశీయ కరెన్సీలో చెప్పాలంటే రూ.66 చెల్లిస్తే సరిపోతుంది. అయితే అది ఆ హోటల్‌లో ఉన్న మిగతా రూములకు వర్తించదు. కేవలం 8వ నెంబర్‌ గదికి మాత్రమే ఈ సదుపాయం ఉంది. అంతేకాదు.. అందులో బస చేయాలంటే హోటల్‌ యాజమాన్యం చెప్పే షరతులకు అంగీకరించాలి. ఇక ఒక్క డాలర్‌ అద్దెగదిలో అన్నిరకాల వసతులు ఉంటాయి. కానీ అదనంగా ఆ గదిలో ఓ కెమెరా కూడా ఉంటుంది.

దీనిద్వారా రాత్రి గదిలో అద్దెకు దిగిన వారు చేసేదంతా యూట్యూబ్‌లో లైవ్‌ స్ట్రీమింగ్‌ నిర్వహిస్తారు. అసలు ఈ ఆలోచన వీళ్లకొచ్చింది కాదు. ఓ బ్రిటీష్‌ ట్రావెలర్‌ ఈ హోటల్‌లో బస చేసిన రాత్రి లైవ్‌స్ట్రీమింగ్‌ చేశాడు. ఇది నచ్చిన సదరు యాజమాన్యం అదే ఆలోచనను అమల్లో పెట్టింది. వెంటనే దీనికి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. రూ.66కే అద్దె.. కానీ గదిలో బస చేసే రాత్రి  మొత్తం అక్కడ ఏం జరుగుతుందో యూట్యూబ్‌లో లైవ్‌స్ట్రీమింగ్‌ అవుతుంది. అయితే ఫోన్‌ కాల్స్‌, ఇతరత్రా వ్యక్తిగత విషయాలకు మాత్రం ఇది వర్తించదు. ఈ ఆలోచన చెప్పగానే హోటల్‌ చానల్‌కు 3వేల మందికి పైగా సబ్‌స్ర్కైబ్‌ అయ్యారు. ఎన్నో యాడ్‌లు వచ్చిపడుతున్నాయి. ఆలోచన వర్కవుట్‌ అవడంతో హోటల్‌ యజమాని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top