ట్రంప్‌ విజయంపై ఉగ్రవాదులు సంతోషం | ISIS, Al-Qaeda Hail Trump's Win | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ విజయంపై ఉగ్రవాదులు సంతోషం

Nov 10 2016 7:29 PM | Updated on Aug 17 2018 7:36 PM

ట్రంప్‌ విజయంపై ఉగ్రవాదులు సంతోషం - Sakshi

ట్రంప్‌ విజయంపై ఉగ్రవాదులు సంతోషం

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌ విజయం సాధించడంపట్ల ఉగ్రవాద సంస్థలు సంతోషం వ్యక్తం చేశాయి.

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌ విజయం సాధించడంపట్ల ఉగ్రవాద సంస్థలు సంతోషం వ్యక్తం చేశాయి. అదే సమయంలో ఇక అమెరికాకు చీకటి రోజులు మొదలైనట్లేనంటూ వ్యాఖ్యానించాయి. ట్రంప్‌ విజయం ఖరారైన కొద్ది సేపటికే ఉగ్రవాద సంస్థలు ఇస్లామిక్‌ స్టేట్‌, అల్‌ కాయిదాకు సంబంధించిన వ్యక్తులు కొందరు సోషల్‌ మీడియాలో తమ ప్రతి స్పందనను తెలియజేశారు.

’విజయం వల్ల రానున్న రోజుల్లో ట్రంప్‌ చేష్టలకు ముస్లింలకు అమెరికాలో ప్రతికూల పరిస్థితి ఏర్పడుతుంది. అది ట్రంప్‌ కు వ్యతిరేకంగా నిగూఢంగా వ్యతిరేకతను, విద్వేశాన్ని పెంపొందిస్తుంది. దీనివల్ల అమెరికాకు నష్టమే’ అని ఇస్లామిక్‌ స్టేట్‌ సంస్థకు సంబంధించిన సంస్థ అల్‌ మిన్బార్‌ జిహాదీ మీడియా నెట్‌ వర్క్‌ పేర్కొంది. ఇంకొందరైతే ట్రంప్‌ ముజాహిదీన​ ఉగ్రవాదులను ఏకం చేస్తారంటూ ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement