కుప్పకూలిన ఆర్మీ హెలికాఫ్టర్... | Iraq military helicopter crashes, killing nine crew | Sakshi
Sakshi News home page

కుప్పకూలిన ఆర్మీ హెలికాఫ్టర్...

Feb 16 2016 7:11 PM | Updated on Sep 3 2017 5:46 PM

ఇరాక్ ఆర్మీ హెలికాఫ్టర్ కుప్పకూలిపోయి తొమ్మిది మంది మృతిచెందారు.

బాగ్దాద్: ఇరాక్ ఆర్మీ హెలికాఫ్టర్ కుప్పకూలిపోయి తొమ్మిది మంది మృతిచెందారు. ఈ ఘటన బాగ్దాద్ దక్షిణ ప్రాంతంలో మంగళవారం సంభవించిందని అధికారులు వెల్లడించారు. బ్రిగేడియర్ జనరల్ యహ్య రసూల్ తెలిపిన వివరాల ప్రకారం... సోవియట్ యూనియన్ తయారుచేసిన హెలికాఫ్టర్ ఎమ్ఐ-17 సాంకేతిక లోపాలు తలెత్తిన కారణంగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఇందులో వెళ్తోన్న ఇద్దరు ఆర్మీ అధికారులు సహా తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు.

ఇరాక్ దక్షిణాన ఉన్న బస్రా నుంచి కట్ పట్టణానికి ఆయుధాలతో వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. గతంలో బాగ్దాద్ తూర్పు ప్రాంతంలో 2014 అక్టోబర్ లో బెల్ 407 హెలికాఫ్టర్ లో వెళ్తుండగా మిలిటెంట్లు కుప్పకూల్చడంతో ఇద్దరు ఆర్మీ జవాన్లు కన్నుమూశారు. అదే ప్రాంతంలో కేవలం ఐదు రోజుల తర్వాత జరిగిన మరో హెలికాఫ్టర్ దుర్ఘటన జరిగిన విషయం తెలిసిందే. 2010 జూలైలో సంభవించిన తుఫాన్ కారణంగా ఎమ్ఐ-17 రకానికి చెందిన ఓ హెలికాఫ్టర్ క్రాష్ అవడంతో ఐదుగురు సిబ్బంది చనిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement