40 ఏళ్లుగా సహించాం.. ఇక చాలు!

Iran Foreign Minister Tweets Back At Donald Trump - Sakshi

టెహ్రాన్‌ : అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్‌ దేశాల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహానీలు వరుస ట్వీట్లతో పరస్పరం హెచ్చరికలు చేసుకున్న విషయం తెలిసిందే. అమెరికాతో పెట్టుకుంటే తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుందంటూ ట్రంప్‌ చేసిన హెచ్చరికలపై ఇరాన్‌ విదేశాంగ శాఖ మంత్రి జావేద్‌ జరీఫ్‌ స్పందించారు.

బీ కేర్‌ఫుల్‌...
‘అస్సలు నచ్చడం లేదు.. కొన్ని నెలల క్రితం సంభవించిన అతి పెద్ద పేలుడు శబ్దాన్ని ప్రపంచ మొత్తం విన్నది. ఇరానియన్లు కూడా ఆ శబ్దాలను విన్నారు. నాగరిక ప్రపంచంలో 40 ఏళ్లుగా ఇలాంటి శబ్దాలు వింటూనే ఉన్నాం. ఇక చాలు.. ఎన్నో సామ్రాజ్యాలు కుప్పకూలి పోవడం మేము కళ్లారా చూశాం. అంతేకాదు మేము తలచుకోవడం వల్ల కొన్ని దేశాలు ఉనికి లేకుండా పోయాయి కూడా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి’  అంటూ జావేద్‌ ట్వీట్‌ చేశారు. కాగా పెద్దపులితో ఆటలు వద్దని, ఇరాన్‌తో యుద్ధమంటే అంతతేలిక కాదని హసన్‌ రౌహానీ ట్రంప్‌కు వార్నింగ్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. 2015లో ఇరాన్‌ న్యూక్లియర్‌ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకున్న నాటి నుంచి ఇరు దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతూనే ఉంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top