ఇదో 'చెత్త' వాచీ | Indonesian designer turns waste wood into watches | Sakshi
Sakshi News home page

ఇదో 'చెత్త' వాచీ

Oct 23 2015 3:01 PM | Updated on Sep 3 2017 11:20 AM

ఇదో  'చెత్త' వాచీ

ఇదో 'చెత్త' వాచీ

ఇండోనేషియాలోని మటోవా అనే ఓ కంపెనీ ఉద్యోగులు అద్భుత ఆవిష్కరించారు

జకార్త : చెత్తే కదా అని తీసి పారేస్తే.. దాంతో వాచీలు చేసేసుకుంటాం అంటున్నారు.. ఇండోనేసియాలోని మటోవా కంపెనీ ఉద్యోగులు. అవును.. కాలుష్యం బారి నుంచి భూమాతను కాపాడేందుకు ఈ కంపెనీ ఓ మంచి నిర్ణయం తీసుకుంది. చెత్తను రీసైక్లింగ్ చేసి, దాంతో వాచీలు తయారు చేసి అమ్ముతున్నారు. 


చూడగానే  ఇట్టే ఆకర్షిస్తున్న ఈ వాచీలతో కంపెనీ ఉద్యోగులు.సంచలనం సృష్టించారు. మకావా  కంపెనీ ఒకప్పుడు ఫర్నీచర్ తయారు చేసేది. తమ వద్ద మిగిలిన చెక్కలు, ముక్కలతో ఈ ఎట్రాక్టివ్ వాచీలు తయారుచేస్తున్నారు. రోజుకు 25 రకాల వాచీలు తయారు చేస్తూ ఈ కంపెనీ ప్రకంపనలు సృష్టిస్తోంది. అమెరికా, సింగపూర్, చైనా, జపాన్, దక్షిణాఫ్రికాల నుంచి ఈ 'చెత్త వాచీ'లకు విరివిగా ఆర్డర్లు వస్తున్నాయి. మటోవా కంపెనీలో పనిచేసే సిబ్బంది 25 మంది మాత్రమే.  అక్కడ తయారయ్యేది వారానికి 25 వాచీలు మాత్రమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement