భారతీయులపై కోవిడ్‌ పడగ

Indians among worst affected minority groups in England - Sakshi

బ్రిటన్‌లో కరోనాతో 420 మంది మృతి

అమెరికాలో పిల్లులకూ కరోనా

డబ్ల్యూహెచ్‌వోకు చైనా అదనపు గ్రాంట్‌

లండన్‌/న్యూయార్క్‌/ఇస్లామాబాద్‌/బీజింగ్‌: బ్రిటన్‌లోని భారతీయులపై కరోనా వైరస్‌ ప్రభావం తీవ్రంగా పడింది. దేశంలో కోవిడ్‌ కారణంగా మరణించిన వారిలో కనీసం 3 శాతం మంది భారతీయ సంతతి వారు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. బ్రిటన్‌లోని ఆసుపత్రుల నుంచి సేకరించిన వివరాల ప్రకారం.. ఈనెల 17వ తేదీ వరకు 13,918 మంది కోవిడ్‌తో మరణించగా ఇందులో 16.2 శాతం మంది నల్లజాతీయులు, ఆసియా, మైనార్టీ తెగల నేపథ్యం ఉన్న వారు.

ఈ వర్గానికి చెందిన వారు మొత్తం 2,252 మంది ప్రాణాలు కోల్పోయారు. భారతీయ సంతతికి చెందిన వారు ఇందులో 420 మంది ఉన్నారు. దేశంలో మైనార్టీ నేపథ్యమున్న వారి సంఖ్య 13 శాతం మాత్రమే అయినా కరోనా వైరస్‌తో మరణాల్లో ఇంతకంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. మృతుల్లో శ్వేత జాతీయులు 73.6 శాతం ఉండగా, మిశ్రమ నేపథ్యమున్న వారు 0.7 శాతమని, ఇతర ఆసియా దేశాలకు చెందిన వారు 1.6 శాతమని సమాచారం. కోవిడ్‌ బాధితులకు చికిత్సచేసే వైద్య సిబ్బందిలో 69 మంది వైరస్‌కు బలయ్యారు.

రెండు పిల్లులకు వైరస్‌ పాజిటివ్‌
కోవిడ్‌ నెమ్మదిగా జంతువులకు విస్తరిస్తోంది. న్యూయార్క్‌లో రెండు పిల్లులు ఈ వ్యాధి బారిన పడ్డాయని అధికారులు ప్రకటించారు. పెంపుడు జంతువులకు ఈ వైరస్‌ సోకడం ఇదే తొలిసారి అని తెలిపారు. న్యూయార్క్‌ రాష్ట్రంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఈ పిల్లులు ఉన్నట్లు చెప్పారు. వైరస్‌ సోకిన ఒక పిల్లి యజమాని కుటుంబంలో వైరస్‌ లేదు. ఇంకో పిల్లి యజమాని కోవిడ్‌ బాధితుడు.

అమెరికాలో 1,738 మంది మృతి
అమెరికాలో కరోనా వైరస్‌ బుధవారం 1,738 మందిని బలితీసుకుంది. అంతకు ముందు రోజుతో పోలిస్తే ఇది స్వల్పంగా తక్కువని జాన్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ తెలిపింది. అమెరికాలో కరోనా కారణంగా ఇప్పటివరకు 46,583 మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. ప్రపంచంలోనే అత్యధిక మరణాలు కూడా ఇక్కడే నమోదయ్యాయి.

కోవిడ్‌పై చైనా, పాక్‌ ఉమ్మడి ప్రయోగాలు
కోవిడ్‌–19 టీకాపై ప్రయోగాల నిర్వహణకు సహకరించాలని పాకిస్తాన్‌ను చైనా కోరింది. ఇస్లామాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ (ఎన్‌ఐహెచ్‌) ద్వారా పాక్‌లో కోవిడ్‌ టీకా ప్రయోగాలు నిర్వహించాలని చైనా సంస్థ సైనోఫార్మ్‌ ఇంటర్నేషనల్‌ కార్పొరేషన్‌ నిర్ణయించింది. అయితే, ఈ విషయంపై ఇప్పటివరకూ ఒక నిర్ణయం తీసుకోలేదని, ఈ భాగస్వామ్యం అమల్లోకి వస్తే తమకు మేలు జరుగుతుందని పాక్‌ అంటోంది.  
డబ్ల్యూహెచ్‌వోకు చైనా అదనపు గ్రాంట్‌
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)కు ఏటా ఇచ్చే రూ.152 కోట్లకు అదనంగా మరో రూ.228 కోట్లు ఇస్తున్నట్లు చైనా ప్రకటించింది. డబ్ల్యూహెచ్‌వోకు నిధులు నిలిపివేస్తున్నట్లు ఇటీవల అగ్రరాజ్యం అమెరికా ప్రకటించిన వెంటనే తాము ఎక్కువ నిధులు ఇస్తామని చైనా ప్రకటించిన విషయం తెలిసిందే.   

చైనాలో 2.32 లక్షల కేసులు: అధ్యయనం
చైనాలో కరోనా కేసులను ఆ దేశ ప్రభుత్వం తక్కువగా చెబుతోందని ప్రపంచ దేశాలన్నీ ఆరోపణలు గుప్పిస్తున్న వేళ, చైనాలో దాదాపు 2.32 లక్షల కేసులు నమోదై ఉంటాయని హాంకాంగ్‌ యూనివర్సిటీ నిపుణులు అంచనా వేశారు. ఫిబ్రవరి 20 నాటికి చైనా 55 వేల మందికి కరోనా సోకినట్లు చెప్పిందని, కానీ అప్పటికే దాదాపు 2.32 లక్షల మందికి కరోనా సోకి ఉంటుందని  లాన్సెట్‌ మెడికల్‌ జర్నల్‌లో ఓ నివేదిక ప్రచురితమైంది. చైనా చెబుతున్న సంఖ్యకు, నిజమైన సంఖ్యకు వ్యత్యాసం ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. చెప్పిన సంఖ్య కంటే ఎక్కువ కేసులు నమోదై ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

26-05-2020
May 26, 2020, 05:02 IST
న్యూఢిల్లీ: పెండింగ్‌లో ఉన్న సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షలను దేశవ్యాప్తంగా 15 వేల కేంద్రాల్లో నిర్వహించనున్నట్టు కేంద్ర మానవ...
26-05-2020
May 26, 2020, 04:50 IST
సాక్షి ముంబై: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి మహారాష్ట్రను హడలెత్తిస్తోంది. రాష్ట్రంలో కరోనా వైరస్‌ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. రాష్ట్రంలో...
26-05-2020
May 26, 2020, 04:42 IST
న్యూఢిల్లీ/ బీజింగ్‌: కరోనా వైరస్‌ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో భారత్‌లో ఉంటున్న చైనీయులందరినీ ఖాళీ చేసి...
26-05-2020
May 26, 2020, 04:21 IST
న్యూఢిల్లీ:   దేశంలో కరోనా కాఠిన్యం కొనసాగుతూనే ఉంది. పాజిటివ్‌ కేసులు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. మరణాల సంఖ్య 4 వేలు దాటేసింది....
26-05-2020
May 26, 2020, 04:08 IST
న్యూఢిల్లీ/బెంగళూరు: దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌ వల్ల నిలిచిపోయిన విమాన సర్వీసులు రెండు నెలల తర్వాత సోమవారం పునఃప్రారంభమయ్యాయి....
26-05-2020
May 26, 2020, 04:03 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా 41 మంది డిశ్చార్జి కావడంతో సోమవారానికి కరోనా వైరస్‌ నుంచి కోలుకున్న వారి సంఖ్య...
26-05-2020
May 26, 2020, 03:56 IST
హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: 2008లో సంభవించిన ఆర్థిక సంక్షోభం కంటే కరోనా ప్రభావం అత్యంత తీవ్రంగా ఉందని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌...
26-05-2020
May 26, 2020, 03:41 IST
ప్రకటనల ఆదాయం పడిపోవడంతో స్టఫ్‌ ఆర్థికంగా కష్టాలను ఎదుర్కొంటున్న క్రమంలో ఈ డీల్‌ చోటు చేసుకుంది.  
26-05-2020
May 26, 2020, 03:32 IST
న్యూఢిల్లీ: హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం(2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో 10 శాతం...
26-05-2020
May 26, 2020, 03:03 IST
న్యూఢిల్లీ: కరోనా  వ్యాప్తి కట్టడి కోసం లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ పోవడమనేది ఆర్థిక వినాశనానికి దారితీస్తుందని మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌...
26-05-2020
May 26, 2020, 02:42 IST
సాక్షి, హైదరాబాద్‌/శంషాబాద్‌ : కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ కారణంగా 2 నెలలుగా నిలిచిన దేశీయ విమానాల రాకపోకలు సోమవారం తిరిగి...
26-05-2020
May 26, 2020, 01:56 IST
లాక్‌డౌన్‌ ప్రభావం ఇంకా చాలాకాలం ఉంటుందని, పొదుపు పాటిస్తామని చెప్పినవారు : 82%  ఆన్‌లైన్‌ కొనుగోళ్లకు మొగ్గు చూపినవారు : 44%  స్థానిక కిరాణా దుకాణాలపైనే...
26-05-2020
May 26, 2020, 00:10 IST
సినిమా షూటింగ్‌ అంటే సందడి. ఓ హడావిడి. ఓ గందరగోళం. లొకేషన్‌ అంతా యూనిట్‌ సభ్యులతో కిటకిటలాడుతుంది. రానున్న రోజుల్లో...
25-05-2020
May 25, 2020, 22:37 IST
కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 31 మంది, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒకరు ఉండగా.. వలసదారులు 15 మంది..
25-05-2020
May 25, 2020, 19:51 IST
ముంబై: దేశంలో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతోంది. దేశ‌వ్యాప్తంగా న‌మోద‌వుతున్న కేసుల్లో మ‌హారాష్ట్ర‌లోనే స‌గానికిపైగా ఉన్నాయి. ఇక్క‌డి ముంబై క‌రోనా పీడితులకు ఆల‌వాలంగా...
25-05-2020
May 25, 2020, 19:37 IST
ఒక్కపక్క కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్న అసోం రాష్ట్రాన్ని ఇప్పుడు వరదలు వణికిస్తున్నాయి.
25-05-2020
May 25, 2020, 18:20 IST
విపరీతమైన రద్దీ నేపథ్యంలో.. ఆ ట్రైన్‌ను ఒడిషా మీదుగా ఉత్తర్‌ప్రదేశ్‌కు తీసుకెళ్లారు. దాంతో 25 గంటల్లో గమ్యస్థానానికి చేరుకోవాల్సిన రైలు...
25-05-2020
May 25, 2020, 17:23 IST
రాష్ట్రంలో కరోనా ప్రభావం తగ్గడంతో బాబు మళ్లీ ఏపీ బాట పట్టారని ఎద్దేవా చేశారు. ఆయనను రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మంత్రి...
25-05-2020
May 25, 2020, 17:05 IST
ఫ్యాక్టరీలు తెరుచుకున్నాక ప్రభుత్వం అనుమతించడం పట్ల పరిశ్రమల యజమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
25-05-2020
May 25, 2020, 17:00 IST
తిరువనంతపురం: కేర‌ళ‌లో విచిత్ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. పండు త‌ల మీద ప‌డ‌టంతో తీవ్ర‌గాయాల‌పాలైన వ్య‌క్తికి క‌రోనా సోకిన‌ట్లు తేలింది. వివ‌రాల్లోకి వెళ్తే.....
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top