ఐబీడీపీ పరీక్షలో టాపర్‌గా ఎన్నారై విద్యార్థిని | Indian-Origin Student Tops Prestigious Exam In Singapore | Sakshi
Sakshi News home page

ఐబీడీపీ పరీక్షలో టాపర్‌గా ఎన్నారై విద్యార్థిని

Jul 24 2016 10:06 AM | Updated on Sep 4 2017 6:04 AM

ఐబీడీపీ పరీక్షలో టాపర్‌గా ఎన్నారై విద్యార్థిని

ఐబీడీపీ పరీక్షలో టాపర్‌గా ఎన్నారై విద్యార్థిని

ప్రతిష్టాత్మక అంతర్జాతీయ బాకాలారైట్ డిప్లొమా పరీక్ష(ఐబీడీపీ)-2016లో సింగపూర్‌లోని ప్రవాస భారత విద్యార్థిని రసికా కాలె టాపర్‌గా నిలిచింది.

సింగపూర్: ప్రతిష్టాత్మక అంతర్జాతీయ బాకాలారైట్ డిప్లొమా పరీక్ష(ఐబీడీపీ)-2016లో సింగపూర్‌లోని ప్రవాస భారత విద్యార్థిని రసికా కాలె టాపర్‌గా నిలిచింది. 12వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన ఈ పరీక్షకు పోటీలో ఉన్న 40 దేశాల విద్యార్థులను అధిగమించి మొత్తం 45 పాయింట్లకు 45 సాధించింది. ఇందులో అర్హత సాధించిన వారికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్య అభ్యసించే అవకాశం కలుగుతుంది.

సింగపూర్‌లోని గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూలు(జీఐఐఎస్)లో చదువుతున్న రసికా కాలె.. ప్రజ్ఞ, ఆర్ట్స్ విభాగంలో తన ప్రతిభ చాటి టాపర్ గా నిలిచింది. జీఐఐఎస్ కు చెందిన మరో ముగ్గురు విద్యార్థులు ఆరుషి ఖందేల్వాల్, రేవంద్ రాజేశ్, శిబిరంజిత్ నగేశ్ కూడా ఐబీడీపీలో 45 మార్కులకు 44 మార్కులు సాధించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement