వినాయకుని ప్రకటనపై కేసు వేసిన భారత్‌ | indian govt lodges offical diplomatic protest about offesive australian lamb ad | Sakshi
Sakshi News home page

వినాయకుని ప్రకటనపై కేసు వేసిన భారత్‌

Sep 11 2017 6:38 PM | Updated on Sep 19 2017 4:22 PM

వినాయకుని ప్రకటనపై కేసు వేసిన భారత్‌

వినాయకుని ప్రకటనపై కేసు వేసిన భారత్‌

వినాయకుడు మాంసం తింటున్నట్లు ఉన్న వీడియో వైరల్‌ అయిన విషయం తెలిసిందే.

వినాయకుడు మాంసం తింటున్నట్లు ఉన్న వీడియో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. మీట్‌ అండ్‌ లైవ్‌ స్టాక్‌ అనే ఆస్ట్రేలియా కంపెనీ ప్రకటనలో గణేషుడు నాన్‌వేజ్‌ తింటున్నట్లు చూపించడంపై భారత ప్రభుత్వం అసహనం వ్యక్తం చేసింది. ఆస్ట్రేలియా కోర్టులో దీనిపై ద్వైపాక్షిక విషయాలకు సంబంధించిన అంశంగా కేసు వేసింది. ఈ ప్రకటన కారణంగా భారత ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయని కాన్‌బెర్రాలోని భారత హై కమిషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.  

‘ది మీట్‌ వుయ్‌ కెన్‌ ఆల్‌ ఈట్‌’ పేరుతో ప్ర‌క‌ట‌న రూపొందించిన `మీట్ అండ్ లైవ్‌స్టాక్ ఆస్ట్రేలియా` కంపెనీకి ప్ర‌క‌ట‌న‌ను వెన‌క్కి తీసుకోవాలంటూ సిడ్నీలోని భార‌త కాన్సులేట్ జ‌న‌ర‌ల్‌ నోటీసులు కూడా జారీ చేసింది. అలాగే ఆసీస్‌ నివాసం ఉంటున్న భార‌త క‌మ్యూనిటీ సంఘాలు కూడా ప్ర‌క‌ట‌న‌కు వ్య‌తిరేకంగా ఉద్య‌మించాయి. వీలైనంత త్వ‌ర‌గా ప్ర‌క‌ట‌న ప్ర‌సారాన్ని నిలిపివేయాల‌ని డిమాండ్ చేశాయి. ఈ ప్ర‌క‌ట‌న‌లో వినాయ‌కుడితో పాటు జీసస్‌, బుద్ధుడు, ఇత‌ర గ్రీకు దేవ‌త‌లు కూడా ఉండటం విశేషం.

Advertisement
 
Advertisement
Advertisement