సింగపూర్ పార్లమెంటుకు భారత సంతతి వ్యక్తి | Indian descent to Singapore Parliament | Sakshi
Sakshi News home page

సింగపూర్ పార్లమెంటుకు భారత సంతతి వ్యక్తి

May 9 2016 4:48 AM | Updated on May 29 2019 3:19 PM

అధికార పీపుల్స్ యాక్షన్ పార్టీకి చెందిన భారత సంతతి వ్యక్తి మురళి పిళ్లై సింగపూర్ పార్లమెంటుకు జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించారు.

సింగపూర్: అధికార పీపుల్స్ యాక్షన్ పార్టీకి చెందిన భారత సంతతి వ్యక్తి మురళి పిళ్లై సింగపూర్ పార్లమెంటుకు జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించారు. బుకిట్ బాటక్ స్థానానికి జరిగిన ఎన్నికలో ప్రతిపక్ష సింగపూర్ డెమొక్రటిక్  పార్టీకి చెందిన చీ సూన్ జువాన్‌పై గెలుపొందారు. పిళ్లైకి 61.21 శాతం ఓట్లు , జువాన్‌కు 38.79 శాతం ఓట్లు దక్కాయి. పీఏపీ మాజీ ఎంపీ డేవిడ్ ఓంగ్ గత మార్చిలో వివాహేతర సంబంధం ఆరోపణలతో రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రధాని లీ సీన్ లూంగ్‌కు సంపూర్ణ మెజారిటీ ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement