ఎఫ్‌బీఐ మోస్ట్‌ వాటెండ్‌ లిస్ట్‌లో భద్రేష్‌ | Indian Bhadreshkumar who killed wife inside dunkin donuts restaurant on FBI most wanted List | Sakshi
Sakshi News home page

ఎఫ్‌బీఐ మోస్ట్‌ వాటెండ్‌ లిస్ట్‌లో భద్రేష్‌

Apr 19 2017 9:19 PM | Updated on Oct 1 2018 5:16 PM

ఎఫ్‌బీఐ మోస్ట్‌ వాటెండ్‌ లిస్ట్‌లో భద్రేష్‌ - Sakshi

ఎఫ్‌బీఐ మోస్ట్‌ వాటెండ్‌ లిస్ట్‌లో భద్రేష్‌

భార్యను చంపి పరారీలో ఉన్న భారతీయ యువకుడి పేరును అమెరికా నేరపరిశోధక సంస్థ ఎఫ్‌బీఐ మోస్ట్‌వాంటెడ్‌ జాబితాలో చేర్చింది.

వాషింగ్టన్‌: భార్యను చంపి పరారీలో ఉన్న భారతీయ యువకుడి పేరును అమెరికా నేరపరిశోధక సంస్థ ఎఫ్‌బీఐ మోస్ట్‌వాంటెడ్‌ జాబితాలో చేర్చింది. గుజరాత్‌కు చెందిన భద్రేష్‌ కుమార్‌ చేతన్భాయ్ పటేల్ (26)ను పట్టిచ్చిన వారికి లక్ష అమెరికన్‌ డాలర్లు పారితోషికంగా అందజేస్తామని తెలిపింది. వివరాలివీ..

గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌ సమీపంలోని వీరంగామ్‌కకు చెందిన భద్రేష్‌కుమార్‌ చేతన్‌భాయి పటేల్‌, పాలక్‌(21)ను వివాహం చేసుకుని 2015లో అమెరికా చేరుకున్నారు. వారిద్దరూ మేరీలాండ్‌ రాష్ట్రం హనోవర్‌లో ఉన్న పటేల్‌ బంధువుల రెస్టారెంట్‌లో ఉద్యోగులుగా చేరారు. అయితే, భద్రేష్‌కుమార్‌ అమెరికాలో ఉండిపోవాలని అంటుండగా, అతని భార్య పాలక్‌ స్వదేశం వెళ్లిపోవాలని పట్టుబడుతోంది. దీనిపై ఇద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రెస్టారెంట్‌లోపల ఉన్న గదిలో వారి మధ్య గొడవ జరిగింది. కోపంతో ఉన్న భద్రేష్‌కుమార్‌ భార్యను తీవ్రంగా కొట్టటంతోపాటు కత్తితో పలుమార్లు పొడిచి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.

రెండేళ్ల నుంచి వెతుకుతున్నా పోలీసులకు మాత్రం దొరకలేదు. అతడు అమెరికాలోనే ఉంటున్న పలువురు బంధువులు, పరిచయస్తుల వద్ద తలదాచుకుని ఉంటాడని, లేదా కెనడా వెళ్లిపోయి ఉంటాడని భావిస్తున్నామన్నారు. దీంతోపాటు కెనడా నుంచి తిరిగి ఇండియా వెళ్లి ఉంటాడని అనుమానిస్తున్నట్లు తెలిపారు. అతని ఆచూకీ కోసం స్థానికుల నుంచి పలుమార్గాల్లో వివరాలు సేకరించామన్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేశామని, ఫలితం లేకపోవటంతో మోస్ట్‌వాంటెడ్‌లిస్ట్‌లో అతని పేరు ఉంచినట్లు చెప్పారు. భద్రేష్‌కుమార్‌ ఆచూకీ తెలిపిన వారికి లక్ష అమెరికన్‌ డాలర్లు పారితోషికంగా అందజేస్తామని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement