breaking news
Bhadreshkumar Chetanbhai Patel
-
చిక్కడు.. దొరకడు.. ఎఫ్‌బీఐకి కూడా..
న్యూయార్క్/న్యూఢిల్లీ: ఆ హంతకుడిపై ఏకంగా రూ. 70లక్షల రివార్డు. దర్యాప్తులోనే మేటి అయిన అమెరికా అతని కోసం తెగ అన్వేషిస్తోంది. భారత్‌సహా నాలుగేళ్లుగా ప్రపంచాన్ని జల్లెడ పట్టినా అతడు దొరకలేదు. అమెరికా దర్యాప్తు సంస్థ (ఎఫ్‌బీఐ) టాప్ 10 వాంటెడ్ లిస్టులో స్థానం దక్కించుకున్నాడు. అతడే అహ్మదాబాద్‌కు చెందిన భద్రేశ్ కుమార్ పటేల్ (24). అమెరికాలోని డంకిన్ డోనట్స్ స్టోర్‌లో పనిచేస్తున్న అతడు తన భార్యను కిరాతకంగా చంపాడు. అనంతరం తప్పించుకొని పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. 2015 ఏప్రిల్ 12న రాత్రి పనిచేస్తున్న అతడు తన భార్య ఫలక్ (21)తో కలసి స్టోర్‌లోని కిచెన్‌కు వెళ్లాడు. కాసేపటికి ఒక్కడే బయటకు వచ్చాడు. కొద్ది గంటల తర్వాత పోలీసులు అమె మృత దేహాన్ని కనుక్కున్నారు. చాలా సార్లు కత్తితో పొడిచి మరీ హత్యచేశాడు. సీసీటీవీ ఫుటేజీల ప్రకారం అతడు ఓ టాక్సీలో హోటల్‌కు వెళ్లి రాత్రంతా పడుకొని తెల్లవారాక మాయమయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అతడు కనిపించలేదు. ఎఫ్‌బీఐ అతడి కోసం అమెరికాలోనేగాక భారత్‌లోని గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీలలో కూడా వెదికారు. ఇరుదేశాలు కలసి చేసిన పెద్ద కేసు విచారణ ఇదే కావడం గమనార్హం. -
ఎఫ్‌బీఐ మోస్ట్ వాటెండ్ లిస్ట్‌లో భద్రేష్
వాషింగ్టన్: భార్యను చంపి పరారీలో ఉన్న భారతీయ యువకుడి పేరును అమెరికా నేరపరిశోధక సంస్థ ఎఫ్‌బీఐ మోస్ట్‌వాంటెడ్ జాబితాలో చేర్చింది. గుజరాత్‌కు చెందిన భద్రేష్ కుమార్ చేతన్‌భాయ్ పటేల్ (26)ను పట్టిచ్చిన వారికి లక్ష అమెరికన్ డాలర్లు పారితోషికంగా అందజేస్తామని తెలిపింది. వివరాలివీ.. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ సమీపంలోని వీరంగామ్కకు చెందిన భద్రేష్‌కుమార్ చేతన్భాయి పటేల్, పాలక్(21)ను వివాహం చేసుకుని 2015లో అమెరికా చేరుకున్నారు. వారిద్దరూ మేరీలాండ్ రాష్ట్రం హనోవర్‌లో ఉన్న పటేల్ బంధువుల రెస్టారెంట్లో ఉద్యోగులుగా చేరారు. అయితే, భద్రేష్‌కుమార్ అమెరికాలో ఉండిపోవాలని అంటుండగా, అతని భార్య పాలక్ స్వదేశం వెళ్లిపోవాలని పట్టుబడుతోంది. దీనిపై ఇద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రెస్టారెంట్లోపల ఉన్న గదిలో వారి మధ్య గొడవ జరిగింది. కోపంతో ఉన్న భద్రేష్‌కుమార్ భార్యను తీవ్రంగా కొట్టటంతోపాటు కత్తితో పలుమార్లు పొడిచి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. రెండేళ్ల నుంచి వెతుకుతున్నా పోలీసులకు మాత్రం దొరకలేదు. అతడు అమెరికాలోనే ఉంటున్న పలువురు బంధువులు, పరిచయస్తుల వద్ద తలదాచుకుని ఉంటాడని, లేదా కెనడా వెళ్లిపోయి ఉంటాడని భావిస్తున్నామన్నారు. దీంతోపాటు కెనడా నుంచి తిరిగి ఇండియా వెళ్లి ఉంటాడని అనుమానిస్తున్నట్లు తెలిపారు. అతని ఆచూకీ కోసం స్థానికుల నుంచి పలుమార్గాల్లో వివరాలు సేకరించామన్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేశామని, ఫలితం లేకపోవటంతో మోస్ట్వాంటెడ్లిస్ట్లో అతని పేరు ఉంచినట్లు చెప్పారు. భద్రేష్‌కుమార్ ఆచూకీ తెలిపిన వారికి లక్ష అమెరికన్ డాలర్లు పారితోషికంగా అందజేస్తామని తెలిపింది.