
మాస్కో: ఉగ్రవాదం పోరులో సహకరించుకోవాలని భారత్, రష్యాలు నిర్ణయించాయి. ఆ మేరకు ఉగ్రవాదంపై పోరులో సహకరించుకునేలా ఒప్పందంపై భారత హోం మంత్రి రాజ్‌నాథ్, రష్యా అంతర్గత మంత్రి కోలోకొత్సేవ్‌లు సంతకం చేశారు. 1993లో భారత్, రష్యాల మధ్య జరిగిన ఒప్పందం స్థానంలో కొత్త ఒప్పందం అమల్లోకి వస్తుంది. రష్యా పర్యటనలో భాగంగా సోమవారం రష్యా మంత్రితో రాజ్‌నాథ్ పలు అంశాలపై చర్చలు జరిపారు. సమాచార మార్పిడి విస్తృతం చేయడంతో పాటు డేటాబేస్, పోలీసు, దర్యాప్తు విభాగాలకు శిక్షణలో సహకారానికి కూడా భారత్, రష్యాలు అంగీకరించాయి.