వాషింగ్టన్: మార్పు, కచ్చితమైన చర్యల కోసమే దేశ ప్రజలు తనకు ఓటు వేసి గెలిపించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఒబామా హెల్త్‌కేర్ తదితర పథకాల రద్దు విషయమై ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీల అమలు వేగం పెంచడంపై తనను తాను ఆయన సమర్థించుకున్నారు. నేషనల్ రిపబ్లికన్ కాంగ్రెషనల్ కమిటీ సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘చరిత్రాత్మక మార్పు కోసం గతేడాది నవంబర్ 8న అమెరికన్ ప్రజలు ఓటు వేశారు. కచ్చితమైన చర్యలను ఆశిస్తూ హౌజ్, సెనేట్, వైట్ హౌస్ లను అప్పగించారు. ప్రజలు మనకు స్పష్టమైన సూచనలు చేశారు. పని పూర్తి చేయడానికి ఇదే సరైన సమయం’ అని పేర్కొన్నారు.
‘గురువారం నాటి కీలకమైన ఓటుతో చట్టబద్ధమైన ప్రయత్నం ప్రారంభమవుతుంది. విపత్తు వంటి ఒబామా కేర్‌ను రద్దు చేసి కొత్తదాన్ని ప్రవేశపెట్టడానికి రిపబ్లికన్ పార్టీకి, దేశ ప్రజలకు కూడా ఆ ఓటు కీలకమే’ అని ట్రంప్ తెలిపారు. దేశంలో నెలకొన్న నూతన వ్యాపార వాతావరణం వల్లే అమెరికా ఉద్యోగాలు వెనక్కి వస్తున్నాయని ఈ సందర్భంగా ట్రంప్ చెప్పుకొచ్చారు. మరోవైపు విదేశీయులపై అమెరికన్లు జాతి విద్వేష దాడులకు పాల్పడుతున్నా ఏ చర్యలు తీసుకోకుండా, కేవలం అమెరికన్లకు ఉద్యోగాలు, వారి అభివృద్ధి మాత్రమే తనకు ముఖ్యమని పేర్కొంటూ ట్రంప్ తన శైలిలో పాలన కొనసాగిస్తున్నారు.
ఇదే సరైన సమయం: డొనాల్ట్ ట్రంప్
Published Wed, Mar 22 2017 9:52 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్‌స్టాప్‌గా...
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement