లండన్‌లో తొలి లెస్బియన్‌ వివాహం | Hindu and Jewish women marry in Britain’s first interfaith lesbian wedding | Sakshi
Sakshi News home page

లండన్‌లో తొలి లెస్బియన్‌ వివాహం

Aug 17 2017 3:24 PM | Updated on Sep 12 2017 12:20 AM

ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకున్నారు. ఇందులో కొత్తేం ఉంది అనుకుంటున్నారా.. కానీ వీరు పెళ్లి చేసుకుంది లండన్‌లో.

లండన్‌: ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకున్నారు. ఇందులో కొత్తేం ఉంది అనుకుంటున్నారా.. కానీ వీరు పెళ్లి చేసుకుంది లండన్‌లో. అంతే కాదుయూకేలో ఇదే తొలి మతాంతర  వివాహం అంట. వీరిలో ఒకరు హిందూ కాగా, మరొకరు యూదు జాతీయురాలు. లండన్‌కు చెందిన కళావతి మిస్త్రీ(48), టెక్సాస్‌కు చెందిన మిరియం జెఫర్‌సన్‌ అనే ఇద్దరు ఇరవై ఏళ్ల క్రితం యూఎస్‌లోని టెక్సాస్‌లో అనుకోకుండా కలుసుకున్నారు. అలా వీరి మధ్య చిగురించిన స్నేహం అప్పటి నుంచి కొనసాగుతోంది. యుక్త వయస్సు వచ్చాక తను స్వలింగ సంపర్కులిరాలినన్న విషయం తెలుసుకున్నానని, అయితే కుటుంబసభ్యులు, స్నేహితులతో ఆ విషయం చెప్పటానికి చాలా కాలం భయపడ్డానని కళావతి తెలిపింది.

స్నేహితురాలైన మిరియం కూడా లెస్బియన్‌ కావటంతో ఇద్దరూ ఒక్కటయ్యేందుకు అంగీకారం కుదిరిందని, తమ వివాహానికి రెండు కుటుంబాలు మనస్పూర్తిగా అంగీకరించాయని కళావతి తెలిపింది. ఈ మేరకు ఈ ఏడాది జనవరిలో టెక్సాస్‌ రాష్ట్రం శాన్‌ ఆంటోనియోలో యూదు సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. గత వారం వీరు హిందూ సంప్రదాయం ప్రకారం ఒక్కటయ్యారు. స్థానిక హిందూ మహిళా పూజారి చందావ్యాస్‌ వీరి వివాహ తంతును జరిపించారు. మంగళసూత్రం కూడా కట్టించారు. అనంతరం లీసెస్టర్‌ నగరంలోని చెట్నీ ఐవీ రెస్టారెంట్‌లో వివాహ విందు ఏర్పాటు చేశారు. వివాహానంతరం ఈ జంట తిరిగి అమెరికా వెళ్లిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement