
కెంటకీలో హిల్లరీ విజయం
అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న హిల్లరీ క్లింటన్ కెంటకీలో, శాండర్స్ ఒరెగాన్‌లో విజయం సాధించారు.
ఫ్రాంక్‌ఫర్ట్ (అమెరికా): అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న హిల్లరీ క్లింటన్ కెంటకీలో, శాండర్స్ ఒరెగాన్‌లో విజయం సాధించారు. మంగళవారం కెంటకీ, ఒరెగాన్ ప్రైమరీలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో హిల్లరీ ఒరెగాన్‌లో ఓడిపోయినప్పటికీ ఆమె డెమోక్రటిక్ పార్టీ నామినేషన్‌కు ఢోకా లేదని తెలుస్తోంది. ఎందుకంటే ఆమె నామినేషన్ సాధించడానికి కావాల్సిన మ్యాజిక్ నంబర్ 2,383కు కేవలం 100 మంది డెలిగేట్ల దూరంలో ఉన్నారు.
మరోవైపు రిపబ్లికన్ పార్టీ నేత ట్రంప్ రెండు ప్రైమరీల్లోనూ గెలిచి, ఇప్పటికి 1,171 మంది డెలిగేట్ల మద్దతు సాధించారు. హిల్లరీ సంపాదన 42.87 కోట్లు: హిల్లరీ కిందటేడాది పుస్తకాలపై వచ్చిన రాయల్టీలు, పెయిడ్ స్పీచ్‌లపై ఏకంగా రూ. 42.87 కోట్లు సంపాదించారు. బిల్ క్లింటన్ 22 ప్రసంగాలు చేసి 35 కోట్లు సంపాదించా రు. ట్రంప్ తన వ్యక్తిగత ఆస్తుల విలువ రూ. 66 వేల కోట్ల పైమాటే అని ప్రకటించిన కొన్ని గంటల్లోనే హిల్లరీ సంపాదన ప్రకటన వెలువడటం విశేషం.