బిల్డింగ్‌పై కుప్పకూలిన హెలికాప్టర్‌ : వణికిన జనం

Helicopter Crashes on Roof of Manhattan Building  Killing Pilot - Sakshi

అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఓ హెలికాప్టర్ కుప్పకూలింది. మాన్‌హాటన్‌లోని 51 అంతస్థుల భవనంపై  బిల్డింగ్‌పై చాపర్ ఒక్కసారిగా కూలడంతో  పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.  దీంతో 2001, సెప్టెంబర్ 11 తరహా  దాడులా  అన్న భయాందోళనలతో  అందరు వణికిపోయారు. ఈ ప్రమాదంలో పైలట్ టిమ్‌  మెక్‌ కార్‌మాక్‌ దుర్మరణం చెందాడు. 

దీంతో మొత్తం భవనం కంపించిపోయిందని భవనంలో నివాసం ఉంటున్నవారు చెప్పారు.  ఘటనాస్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. ఘటన జరిగిన వెంటనే భవనంలోని కార్యాలయాల నుంచి ఉద్యోగులను ఖాళీ చేయించారు. హెలికాప్టరు కూలిన ఘటన వెనుక ఉగ్రవాదుల హస్తం లేదని, వాతావరణం అనుకూలించక జరిగిన ప్రమాదమని పోలీసులు తేల‍్చడంతో​ అందరూ  ఊపిరి పీల్చుకున్నారు. అయితే  హెలికాప్టరు  మంటల్లో కాలి బూడిదగా మారింది. హెలికాప్టర్‌లో పైలట్‌  ఒక్కరే ప్రయాణిస్తున్నట్టు సమాచారం.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top