హెలికాప్టర్ ప్రమాదంలో మంత్రులు మృతి | Ghana Helicopter Crash kills defence and environment ministers 6 others | Sakshi
Sakshi News home page

హెలికాప్టర్ ప్రమాదంలో మంత్రులు మృతి

Aug 6 2025 11:08 PM | Updated on Aug 6 2025 11:16 PM

Ghana Helicopter Crash kills defence and environment ministers 6 others

పశ్చిమ ఆఫ్రికా దేశంలోని ఘనాలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. దాంతో ఆ దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. బుధవారం జరిగిన ఈ విషాద సంఘటనలో మరణించిన ఎనిమిది మందిలో రక్షణ మంత్రి ఎడ్వర్డ్ ఒమానే బోమా మరియు పర్యావరణ మంత్రి ఇబ్రహీం ముర్తాలా ముహమ్మద్ ఉన్నారు. 

ఘనా సాయుధ దళాల ప్రకారం, Z-9 యుటిలిటీ హెలికాప్టర్ బుధవారం ఉదయం రాజధాని నగరం అక్ర నుండి బయలుదేరింది. అక్కడ నుండి అశాంతి ప్రాంతంలోని కీలకమైన బంగారు గనుల పట్టణం ఒబువాసి వైపు వెళుతుండగా రాడార్ సిగ్నల్స్‌ తెగిపోయినట్టు తెలుస్తోంది. ఈ సంఘటనను అక్కడి ప్రభుత్వం "జాతీయ విషాదం"గా ప్రకటించింది.అయితే ఈ ప్రమాదానికి గల ఇతర కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement