వాషింగ్టన్: దక్షిణ చైనా సముద్రంలో అమెరికా నేవీ హెలికాప్టర్, ఫైటర్ జెట్ కుప్పకూలిపోయాయి. కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే రెండు వైమానిక వాహనాలు ప్రమాదానికి గురికావడం చర్చనీయాంశంగా మారింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో ఉన్న ముగ్గురు సిబ్బంది, ఫైటర్ జెట్‌లో ఉన్న ఇద్దరు పైలట్లను సురక్షితంగా కాపాడారు.
వివరాల ప్రకారం.. అక్టోబర్ 26, 2025 సాయంత్రం 2:45 గంటలకు మొదటగా ఎంహెచ్-60ఆర్ సీహాక్ హెలికాప్టర్ దక్షిణ చైనా సముద్రంలో కూలిపోయింది. తర్వాత అర గంట వ్యవధిలో అంటే.. 3:15 గంటలకు బోయింగ్ ఎఫ్-18 సూపర్ హార్నెట్ ఫైటర్ జెట్ అదే సముద్రంలో కుప్పకూలిపోయింది. అయితే, ప్రమాదానికి గురైన, నావికా విమానం, హెలీకాప్టర్ రెండూ యూఎస్ నిమిట్జ్ షిప్ నుండి ఆపరేట్ చేస్తున్నవి కావడం విశేషం.
అయితే, ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో ఉన్న ముగ్గురు సిబ్బంది, ఫైటర్ జెట్‌లో ఉన్న ఇద్దరు పైలట్లు సురక్షితంగా ఉన్నారు. పైలట్లు సముద్రంలోకి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే, సాధారణ కార్యకలాపాల్లో ఉన్నప్పుడే ప్రమాదాలు జరిగినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనలపై విచారణ జరుగుతోందని అమెరికా పసిఫిక్ ఫ్లీట్ అధికారులు ప్రకటించారు. అయితే, ప్రమాదాలకు కారణాలు ఇంకా తెలియరాలేదు.
US Navy fighter jet and helicopter crash in the South China Sea
The US Navy announced in a statement that a Boeing F/A-18E and F/A-18F Super Hornet and an MH-60R Sea Hawk Helicopter separately crashed during operations from the aircraft carrier USS Nimitz in the South China Sea. pic.twitter.com/bX9dVaemTM— IRNA News Agency (@IrnaEnglish) October 27, 2025


