రొయ్య పెంకుతో.. ప్లాస్టిక్! | Harvard University scientists research | Sakshi
Sakshi News home page

రొయ్య పెంకుతో.. ప్లాస్టిక్!

May 16 2014 2:43 AM | Updated on Sep 2 2017 7:23 AM

రొయ్య పెంకుతో.. ప్లాస్టిక్!

రొయ్య పెంకుతో.. ప్లాస్టిక్!

రొయ్యలు తినేందుకు రుచిగా ఉండవచ్చుగానీ.. వీటితో ఇప్పుడు ఇంకో ప్రయోజనమూ చేకూరబోతోంది.

రొయ్యలు తినేందుకు రుచిగా ఉండవచ్చుగానీ.. వీటితో ఇప్పుడు ఇంకో ప్రయోజనమూ చేకూరబోతోంది. ఫొటోలో కనిపిస్తున్న రంగురంగుల ప్లాస్టిక్ వస్తువులన్నీ రొయ్యల పైభాగంలోని పెంకుతో తయారయ్యాయి! సాధారణ ప్లాస్టిక్‌తో పోలిస్తే ఎంతో గట్టిగా ఉంటుంది. అంతేకాదు చాలా త్వరగా భూమిలో శిథిలమైపోతుంది.

ముడిచమురు నుంచి తయారయ్యే సాధారణ ప్లాస్టిక్ వెయ్యేళ్లపాటు శిథిలం కాకుండా పర్యావరణానికి చేటు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తగిన ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల ఇప్పటికీ దీన్నే వాడుతున్నాం. హార్వర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల పరిశోధనల పుణ్యమాని రొయ్య పెంకులతో తయారయ్యే ప్లాస్టిక్ అందుబాటులోకి వస్తే పర్యావరణ సమస్యలను అధిగమించవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement