బ్రస్సెల్స్లో ఆంత్రాక్స్ కలకలం! | Grand Mosque of Brussels evacuated over anthrax alert | Sakshi
Sakshi News home page

బ్రస్సెల్స్లో ఆంత్రాక్స్ కలకలం!

Nov 26 2015 11:41 PM | Updated on Sep 3 2017 1:04 PM

బ్రస్సెల్స్లో ఆంత్రాక్స్ కలకలం!

బ్రస్సెల్స్లో ఆంత్రాక్స్ కలకలం!

బెల్జియంలోని బ్రస్సెల్స్ నగరంలో ఆంత్రాక్స్ పౌడర్ కలకలం సృష్టించింది.

బ్రస్సెల్స్: బెల్జియంలోని బ్రస్సెల్స్ నగరంలో ఆంత్రాక్స్ పౌడర్ కలకలం సృష్టించింది. యూరోపియన్ యూనియన్ ప్రధాన కార్యాలయ కేంద్రమైన బ్రస్సెల్స్ లోని ప్రఖ్యాత మసీదు వద్ద గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. మసీదు సమీపంలో లభ్యమైన ఓ కవర్లో తెల్ల పౌడర్ దొరికింది. ప్రమాదకరమైన ఆంత్రాక్స్ పౌడర్ వాడి ఎవరో యుద్దానికి దిగే చర్యకు యత్నించారని అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు.

ఆంత్రాక్స్ ప్రభావం తగ్గించే చర్యలు చేపట్టినట్లు ఫైర్ సర్వీస్ అధికార ప్రతినిధి పీర్రే మేయిస్ తెలిపారు. ఆంత్రాక్స్ వార్త స్థానికంగా కలకలం సృష్టించడంతో సమీపంలోని పెద్ద మసీదు పరిసరాలలో  భద్రత కట్టుదిట్టం చేసి,  ప్రజలను వేరే ప్రాంతానికి తరలించారు. అంబులెన్సులు, ల్యాబ్ నిపుణులతో ఆ ప్రాంతం చాలా హడావిడిగా కనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement