గాళ్‌ఫ్రెండ్‌ ప్రేమను ఒప్పుకుందేమో అందుకే..

Gorilla Bathtub Dance Viral Video - Sakshi

డల్లాస్‌ : చిన్నతనంలో నీళ్లున్న బకెట్‌లోకో లేదా టబ్బులోకో దిగి కేరింతలు కొడుతూ ఆడుకున్న రోజులు ఎప్పటికీ మర్చిపోలేము. సంతోషమంతా మనదే అన్నట్లుగా ఆడుకున్న అమాయకత్వపు రోజులు మళ్లీ రావు. ఏదో ఒక సందర్భంలో ఆ సంఘటనలు గుర్తుకొచ్చినపుడు మాత్రం​ మనసు అదోలాంటి భావంతో ఉప్పొంగుతుంది. మన చిన్నతనాన్ని గుర్తుచేసేలా బాత్‌టబ్‌లో డ్యాన్స్‌ ఇరగదీసేసింది ఓ గొరిల్లా. డల్లాస్‌ జూకు చెందిన జోలా అనే మగ గోరిల్లా నీటితో నింపిన బాత్‌టబ్‌లోకి దిగి ఒళ్లు మైమరిచిపోయింది. అటుఇటు తిరుగుతూ.. చేతుల్తో నీటిని చిమ్ముతూ సంతోషంతో ఆడింది. ( లాక్‌డౌన్‌: ఆ వార్తలో నిజం లేదు )

2017లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను సుశాంత నంద అనే ఐఎఫ్‌ఎస్‌ అధికారి తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. తన చిన్నతనాన్ని గుర్తు చేసుకుంటూ దానికో శీర్షికను కూడా పెట్టారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు..‘‘ గాళ్‌ఫ్రెండ్‌ తన ప్రేమను ఒప్పుకుందేమో, అందుకే ఈ సంతోషం... అది నేనే! ఓ వారం రోజుల తర్వాత స్నానం చేసినపుడు..  ఓ మై గాడ్‌! అతడెంతలా సంతోష పడుతున్నాడు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ( ఆ గిఫ్ట్ ఇవ్వ‌గానే ఏడ్చేసిన వృద్ధుడు )

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top