కరోనా : గూగుల్ స్పెషల్‌ వెబ్‌సైట్‌

Google launches educational coronavirus website  - Sakshi

గూగుల్‌ హోం పేజీలో కరోనా వైరస్‌ సేఫ్టీ టిప్స్‌

కోవిడ్‌-19 వెబ్‌సైట్‌  లాంచ్‌

శాన్‌ఫ్రాన్సిస్కో: ప్రపంచవ్యాప్తంగా కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో అమెరికాకు చెందిన సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌-19(కరోనా వైరస్‌) పై అవగాహన కల్పించేందుకు,  సందేహాలను నివృత్తి  చేసేందుకు కొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఈ మహమ్మారి బారిని పడకుండా, కాపాడుకునే రక్షణ చర్యలు తదితర  సమాచారాన్ని అందించేందుకు వీలుగా  ఈ వెబ్‌సైట్‌ను శనివారం  లాంచ్‌ చేసింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విలేకరుల సమావేశం నిర్వహించిన వారం తరువాత, గూగుల్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా కరోనావైరస్ కోసం గూగుల్ ఒక స్క్రీనింగ్ వెబ్‌సైట్‌ను తీసుకోవాలనీ, తద్వారా ఇది ప్రజలను పరీక్షా సైట్‌లకు నిర్దేశించాలని ట్రంప్‌ పేర్కొన్న నేపథ్యంలో ‘గూగుల్.కామ్/కోవిడ్19 అనే వెబ్‌సైట్ ను తీసుకొచ్చింది. ఈ వైరస్‌పై అవగాహన, నివారణ, స్థానిక వనరులపై దృష్టి కేంద్రీకరించింది. కోవిడ్‌ -19 సమాచారం రాష్ట్రాల ఆదారంగా, భద్రత , నివారణ  మార్గాలతోపాటు , కోవిడ్‌  సంబంధ సెర్చ్‌, ఇతర సమాచారం లభిస్తుందని గూగుల్‌ తెలిపింది.  అమెరికాలో ప్రారంభించిన ఈ వెబ్‌సైట్‌ రానున్న రోజుల్లో ఇతరదేశాలు, మరిన్ని భాషల్లో అందుబాటులోకి తీసుకొస్తామని లాంచ్‌ సందర్భంగా గూగుల్ ఒక బ్లాగ్ పోస్ట్  ద్వారా వెల్లడించింది. మరిన్ని వనరులు అందుబాటులోకి వచ్చినప్పుడు  వెబ్‌సైట్‌ను అప్‌డేట్ చేస్తామని తెలిపింది.  ఎప్పటిలాగానే ఇది ప్రజలకు ఉపయోగపడుతుందని విశ్వసిస్తున్నామని చెప్పింది.  సెర్చ్‌  ఫలితాల్లో, గూగుల్ మ్యాప్స్‌లో నేరుగా కరోనావైరస్ గురించి నమ్మదగిన సమాచారం అందేలా  చేస్తామని   సెర్చ్ దిగ్గజం తెలిపింది.  కాగా  కరోనా మరణాల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా శనివారం నాటికి 11,000 దాటింది. 2,35,000 మంది ప్రజలు కరోనావైరస్ బారిన పడ్డారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top