దుబాయ్ నగరంలో బీభత్సం సృష్టించిన దోపిడీ దొంగలను పోలీసులు అరెస్టు చేశారు.
దుబాయ్ : దుబాయ్ నగరంలో బీభత్సం సృష్టించిన దోపిడీ దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఏడాది జులైలో ఓ జ్యువెల్లరీ షాపులోకి వెళ్లిన ఐదుగురు ముసుగు దొంగలు కత్తులు, పెప్పర్ స్ప్రేలతో ఉద్యోగులను బెదిరించారు. వారిని వాష్‌రూమ్స్‌లోకి పంపి డోర్స్ లాక్ చేశారు. అనంతరం 1.5 మిలియన్ల దిర్హమ్‌ల విలువైన బంగారాన్ని దోచుకుని కారులో పారిపోయారు.
రంగంలోకి దిగిన పోలీసులు కారు ప్లేట్ నంబర్‌ను గుర్తించి విచారణను ప్రారంభించారు. చిన్న చితకా సమాచారంతో పోలీసులు తీగ లాగడంతో డొంక కదిలింది. దొంగతనానికి పాల్పడిన వ్యక్తులు ఆప్ఘనిస్తాన్‌కు చెందిన వారిగా గుర్తించి అరెస్టు చేశారు. అనంతరం వారిని స్థానిక కోర్టులో హాజరుపర్చారు.