వావ్..నాలుగేళ్లకే అమ్మ ప్రాణం నిలబెట్టాడు | Four-year-old Italian boy saves mother taken ill at the wheel | Sakshi
Sakshi News home page

వావ్..నాలుగేళ్లకే అమ్మ ప్రాణం నిలబెట్టాడు

Jun 28 2016 9:02 AM | Updated on Sep 4 2017 3:38 AM

వావ్..నాలుగేళ్లకే అమ్మ ప్రాణం నిలబెట్టాడు

వావ్..నాలుగేళ్లకే అమ్మ ప్రాణం నిలబెట్టాడు

అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైన తన తల్లిని రక్షించుకొని అందరితో మంచి కొడుకు అనిపించుకుంటున్నాడు.

వరిసి(ఇటలీ): తల్లిదండ్రులను కాపాడుకునే అవకాశం అందరికీ ఉన్నా ఈ రోజుల్లో ఆ పని చాలా తక్కువమంది చేస్తారు. కొంతమందికి కాపాడుకునే స్తోమత ఉన్నప్పటికీ ఆ సమయంలో పక్కన లేకపోవడంతో వారిని కోల్పోవాల్సి ఉంటుంది. కానీ, ఇటలీలో మాత్రం ఓ నాలుగేళ్ల బాలుడు తనకు వచ్చిన అవకాశాన్ని క్షణాల్లో ఉపయోగించుకున్నాడు. అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైన తన తల్లిని రక్షించుకొని అందరితో మంచి కొడుకు అనిపించుకుంటున్నాడు. వైద్యులంతా ఆ బాలుడు చేసిన పనికి ముగ్దులై పోతున్నారు.

ఇటలీలో ఓ తల్లి తన నాలుగేళ్ల కుమారుడితో కలిసి కారులో వెళుతుండగా ఆమెకు గుండె నొప్పి మొదలైంది. వెంటనే కారు ఆపి ఆమె కుప్పకూలిపోవడంతో వెంటనే స్పందించిన ఆ నాలుగేళ్ల బాలుడు కారు దిగి రోడ్డుపై పోయేవాళ్లను ఆపాడు. తన తల్లికి ఏదో అయిందని వెంటనే ఎమర్జెన్సీకి ఫోన్ చేయాలని కోరాడు. దీంతో బాటసారులు అత్యవసర నెంబర్ కు ఫోన్ చేయడంతో ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలోకి తీసుకెళ్లిన వైద్యులు ఆమెకు  చికిత్స చేయడంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఆమెను ఈ రోజు డిశ్చార్జి చేస్తారు. సకాలంలో ఆ బాలుడు తెలివిగా స్పందించడం వల్లే ఆమె ప్రాణాలు కాపాడగలిగామని వైద్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement