అమెరికాలో చోటుచేసుకున్న అతిపెద్ద క్రెడిట్ కార్డుల మోసం కేసులో నలుగురు భారతీయులతో సహా మొత్తం 10 మందిపై కేసు నమోదైంది.
అమెరికాలో చోటుచేసుకున్న అతిపెద్ద క్రెడిట్ కార్డుల మోసం కేసులో నలుగురు భారతీయులతో సహా మొత్తం 10 మందిపై కేసు నమోదైంది. మొత్తం 1245 కోట్ల రూపాయలు నష్టం జరిగినట్టు వారిపై అభియోగాలు నమోదు చేశారు. నిందితులలో వినోద్ దడ్లానీ, విజయ్ వర్మ, అమర్ సింగ్, తర్సీమ్ లాల్ భారతీయులు. మిగిలినవారు న్యూయార్క్, న్యూజెర్సీలకు చెందినవారు.
ఈ కేసును మూడు దశల్లో విచారణ చేయనున్నారు. నేరం చేసినట్టు రుజువైతే 30 ఏళ్ల దాకా జైలు శిక్ష పడే అవకాశముంది. 60 కోట్ల రూపాయలు జరిమానా కూడా ఎదుర్కోనున్నారు.