ఫ్లోరిడాలో భారీ కాల్పులు | Florida authorities report mass shooting at riverfront mall | Sakshi
Sakshi News home page

ఫ్లోరిడాలో భారీ కాల్పులు

Aug 27 2018 3:49 AM | Updated on Oct 2 2018 2:30 PM

Florida authorities report mass shooting at riverfront mall - Sakshi

కాల్పులు జరిగిన ప్రదేశంలో పోలీసులు

జాక్సన్‌విల్లే: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం జాక్సన్‌విల్‌ నగరాన్ని ఆదివారం తుపాకీ కాల్పులు వణికించాయి. జాక్సన్‌విల్‌ ల్యాండింగ్‌ ప్రాంతంలో భారీగా కాల్పులు చోటుచేసుకున్నాయి. కాగా ఈ కాల్పుల్లో నలుగురు మరణించారని, 11 మంది గాయపడ్డారని స్థానిక మీడియా తెలిపింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పోలీసుల ఎదురు కాల్పుల్లో ఒక అనుమానితుడు మరణించాడు. ‘ప్రజలు జాక్సన్‌విల్‌ ల్యాండింగ్‌ ప్రాంతానికి దూరంగా ఉండండి. ప్రస్తుతం అక్కడికి వెళ్లడం సురక్షితం కాదు’ అని స్థానిక పోలీసు అధికారి ఒక ట్వీట్‌లో హెచ్చరించారు. మ్యాడెన్‌ వీడియోగేమ్‌ టోర్నమెంట్‌ నిర్వహిస్తున్న ప్రాంతంలో కాల్పులు జరిగాయని దాని నిర్వాహకులు ఒక ట్వీట్‌లో తెలిపారు. సెయింట్‌ జాన్స్‌ నదీ తీరంలో ఉన్న ఈ ప్రాంతం వినోద కార్యక్రమాలకు పేరుగాంచింది.

Advertisement
 
Advertisement
Advertisement