భర్తతో భార్య గొడవ.. విమానం మళ్లింపు.! | flight diverted after angry wife discovers affair midair | Sakshi
Sakshi News home page

భర్తతో భార్య గొడవ.. విమానం మళ్లింపు.!

Nov 7 2017 9:29 AM | Updated on Nov 7 2017 12:39 PM

flight diverted after angry wife discovers affair midair - Sakshi

మద్యం మత్తులో ఓ మహిళ తనని మోసం చేశాడని భర్తపై గొడవపడి ఏకంగా విమానాన్నేదారి మళ్లించింది. వివరాల్లోకి వెళితే.. ఇరాక్‌ చెందిన ఓ మహిళ భర్త, కుమారుడితో ఢిల్లీ నుంచి బాలి వెళ్లేందుకు ఆదివారం ఖతార్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన దోహా-బాలి క్యుఆర్‌ - 962 విమానం ఎక్కారు. భర్తపై అనుమానంతో భార్య తాను నిద్రపోతున్న సమయంలో భర్త ఫోన్‌ని అతని వేలిముద్రతో అన్‌లాక్‌ చేసి చూసింది. తీరా అందులో వేరే యువతి ఫోటోలు, కాల్‌ లిస్ట్‌ చూసింది. దీంతో భర్త తనను మోసంచేశాడని అందరి ముందు గొడవ పడి నానా రచ్చ చేసింది.

అప్పటికే తాగి ఉన్న ఆమె తోటి ప్రయాణికులు, ఎయిర్‌వేస్‌ సిబ్బంది ఎంత చెప్పినా వినకపోవడంతో పాటు, వారిపై తిరగబడింది. అదుపు చేయలేని స్థితిలో సిబ్బంది దారి మళ్లించి చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో ఆ కుటుంబాన్ని దింపేశారు. అనంతరం విమానాన్ని బాలికి తరలించారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ఈ విమానం చెన్నైలో ల్యాండ్ అయినట్లు సీఐఎస్‌ఎఫ్ ‌(సెంట్రల్‌ ఇన్వెస్టిగేషన్‌ సెక్యురిటీ ఫోర్స్‌)  అధికారులు వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement