200 వైడ్‌బాడీ జెట్‌లు కొనుగోలు చేయనున్న ప్రముఖ సంస్థ Middle East carrier considering ordering 200 jets, including Airbus A350s and Boeing 777X models. Sakshi
Sakshi News home page

200 వైడ్‌బాడీ జెట్‌లు కొనుగోలు చేయనున్న ప్రముఖ సంస్థ

Published Mon, Jun 3 2024 11:23 AM | Last Updated on Mon, Jun 3 2024 12:28 PM

Qatar Airways ordering about 200 jets mix of Airbus A350s and Boeing 777X models

మిడిల్ ఈస్ట్ ఎయిర్‌ క్యారియర్ ఖతార్‌ ఎయిర్‌వేస్‌ దాదాపు 200 విమానాలను కొనుగోలు చేయాలని యోచిస్తోంది. అందులో భాగంగా ఎయిర్‌బస్ ఏ350ఎస్‌, బోయింగ్ 777ఎక్స్‌ మోడళ్లను ఆర్డర్‌ చేయాలని చూస్తున్నట్లు బ్లూమ్‌బర్గ్‌ నివేదిక ద్వారా తెలిసింది.

జులై నెల చివరినాటికి బ్రిటన్‌లో జరగబోయే ‘ఫార్న్‌బరో ఎయిర్ షో’లో విమానాల కొనుగోలుకు సంబంధించి తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. బ్లూమ్‌బర్గ్‌ తెలిపిన వివరాల ప్రకారం..ఖతార్‌ ఎయిర్‌వేస్‌ దాదాపు 200 విమానాలను కొనుగోలు చేయాలనుకుంటుంది. వైడ్‌బాడీ జెట్‌లుగా పేరున్న ఎయిర్‌బస్ ఏ350, బోయింగ్ 777ఎక్స్‌ మోడళ్లను ఆర్డర్‌ చేయాలని చూస్తుంది. దీనిపై ‘ఫార్న్‌బరో ఎయిర్ షో’ నిర్ణయం వెలువడనుంది. ఇంధనాన్ని సమర్థంగా వినియోగించుకునే వైడ్‌బాడీ జెట్‌లపై విమానకంపెనీలు ఆసక్తిగా ఉన్నాయి. నిర్వహణ ఖర్చులను తగ్గించడానికి, పెరుగుతున్న అంతర్జాతీయ ప్రయాణ డిమాండ్‌ను తీర్చడానికి సంస్థ వీటిని కొనుగోలు చేయనుంది.

ఇదీ చదవండి: తగ్గిన చమురు ధరలు.. ఒపెక్‌ప్లస్‌ కూటమి ప్రభావం

ఈ డీల్‌ వివరాలకోసం ఎయిర్‌బస్‌ను సంప్రదించినపుడు విమానాల అవసరాల గురించి కస్టమర్‌లతో నిరంతరం చర్చలు జరుపుతున్నామని తెలిపింది. అయితే ఈ డీల్‌కు సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఖతార్ ఎయిర్‌వేస్ తన కార్యకలాపాలను విస్తరించడానికి 100 నుంచి 150 వైడ్‌బాడీ జెట్‌లను ఆర్డర్ చేయనుందని బ్లూమ్‌బర్గ్‌ మార్చిలోనే నివేదించింది. బోయింగ్, ఎయిర్‌బస్‌లతో ముందస్తు చర్చలు జరుపుతోందని గతంలో తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement