కారు బాంబు పేలి... ఐదుగురు మృతి | Five killed in east Libya car bomb attack: report | Sakshi
Sakshi News home page

కారు బాంబు పేలి... ఐదుగురు మృతి

Published Sat, Jul 4 2015 8:33 AM | Last Updated on Thu, Apr 4 2019 5:24 PM

పశ్చిమ లిబియాలోని డెరనా నగరంలో కారు బాంబు పేలి... ఐదుగురు అక్కడికక్కడే మరణించారు.

ట్రిపోలి: పశ్చిమ లిబియాలోని డెరనా నగరంలో కారు బాంబు పేలి... ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని స్థానిక మీడియా శనివారం వెల్లడించింది.  క్షతగాత్రుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారని పేర్కొంది.

ఈ పేలుడు ఆత్మాహుతి దాడిగా భావిస్తున్నట్లు ఉన్నతాధికారులు భావిస్తున్నారని చెప్పింది. స్థానిక మిలటరీ దళం సభ్యులకు...  ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులకు మధ్య పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ దాడి జరిగిందని ఉన్నతాధికారులు పేర్కొన్నారని వెల్లడించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement