ఆన్లైన్లో చేప హల్చల్ | Fish with 'human face' makes splash online | Sakshi
Sakshi News home page

ఆన్లైన్లో చేప హల్చల్

May 11 2016 9:38 AM | Updated on Sep 3 2017 11:53 PM

సెంట్రల్ చైనాలోని హునన్ ప్రావిన్స్లో వుగంగ్ సిటీలో ఓ అరుదైన చేప అందరినీ ఆకర్షిస్తోంది.

బీజింగ్: సెంట్రల్ చైనాలోని హునన్ ప్రావిన్స్లో వుగంగ్ సిటీలో ఓ అరుదైన చేప అందరినీ ఆకర్షిస్తోంది. ఈ చేప తల భాగం మనిషి ముఖాన్ని పోలి వింతగా కనిపిస్తోంది. నలుపు, గోధుమ రంగుల్లో ఉన్న ఈ చేప 36 సెంటీ మీటర్ల పొడవు, 800 గ్రాముల బరువు ఉంది. విశేషమేంటంటే ఈ చేప కళ్లు, నోరు, ముక్కుభాగం మనిషికి ఉన్నట్టే ఉన్నాయి. ఈ చేప ఫొటోలు చైనా ఇంటర్నెట్ ప్లాట్ఫామ్స్లో వైరల్ అవుతోంది.

వుగంగ్ సిటీలో నివసిస్తున్న క్వియు ఝియోహ్వా అనే ఎలిమెంటరీ స్కూల్ టీచర్ ఈ అరుదైన చేపను గత ఏప్రిల్ 30న ఓ రిజర్వాయర్లో పట్టుకున్నాడు. క్వియు గత 20 ఏళ్లుగా చేపల వేటకు వెళ్తున్నా, తొలిసారి ఇలాంటి అరుదైన చేప దొరికింది. ఆయన తన ఇంట్లో దీన్ని పెంచుకుంటున్నాడు.

ఇలాంటి చేపలు ఉండటం చాలా అరుదైన చైనా మీడియా వార్తలు ప్రచురించింది. 2010లో ఇలాంటి చేప ఉన్నట్టు ఇంగ్లండ్ మీడియా వెల్లడించింది. ఈ చేపను కొనుగోలు చేసేందుకు యజమానికి 40 వేల ఫౌండ్లను ఆఫర్ చేశారని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement