human face
-
ఢిల్లీ ఘటనలో మరో హృదయ విదారక దృశ్యం
ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో హృదయ విదారక దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. ‘‘ఆమె వీల్‌ఛైర్‌లో కూర్చుని ఉంది. ఆమె పక్కనే కుర్చీలో ఉన్న వ్యక్తి ఆమెను గట్టిగా కౌగిలించుకోగా.. ఆమె తన తలను అతని భుజంపై ఆనించింది. రక్షణ కోసం ఎదురుచూస్తూనే.. వారు ఒకరి చేతుల్లో ఒకరు ప్రాణాలు విడిచారు. వీల్‌ఛైర్‌లో ఒకరు.. చేతులు గట్టిగా పట్టుకుని మరో జంట.’’ సహాయక చర్యలు చేపట్టిన అగ్నిమాపక సిబ్బందికి కన్పించిన దృశ్యాలు వారిని కంటతడి పెట్టించింది.బుధవారం ఉదయం ఢిల్లీలోని 'ఫ్లరిష్ స్టే బిఎన్బి' హోటల్లో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో 12 మంది విదేశీయులతో సహా మొత్తం 21 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆ మహిళ టాయిలెట్ సీటుపై కూర్చుని ఉండగా.. ఆ పురుషుడు ఆమె పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుని ఆమెను గట్టిగా పట్టుకుని ఉన్నాడు. మంటల నుండి తప్పించుకోవచ్చనే ఆశతో వారు లోపల తాళం వేసుకున్నట్లు తెలుస్తోందని రెస్క్యూ సిబ్బంది తెలిపారు. మరో గదిలో బెడ్ అంచున కూర్చుని ఉన్న ఒక జంట కనిపించింది. వారిద్దరూ పూర్తిగా కాలి బూడిదయ్యారని లోపల దృశ్యాలు చాలా భయానకంగా ఉన్నాయన్నారు. బేస్మెంట్ (భూగర్భ గది) ద్వారా భవనంలోకి ప్రవేశించాం. హోటల్లోకి ప్రవేశించడానికి తాము షట్టర్‌ను కట్ చేశాం. బేస్మెంట్లోకి ప్రవేశించినప్పుడు, రిసెప్షన్ సమీపంలో పూర్తిగా కాలిపోయిన మొదటి మృతదేహాన్ని చూశాం. అది 20 ఏళ్ల వయసున్న అమ్మాయిది. ఆమె చేతులు, కాళ్లు బిగుసుకుపోయి ఉన్నాయి. ఆమె అక్కడికక్కడే మరణించింది. అక్కడి నుండి కొన్ని అడుగుల దూరంలో, వీల్‌చైర్‌పై ఉన్న ఒక వ్యక్తి కూడా కాలి చనిపోయి కనిపించాడు. మేం ముందుకు వెళ్లినప్పుడు.. ముగ్గురు విదేశీయులు స్పృహ తప్పి పడి ఉండటం చూసి వారికి సీపీఆర్ చేశామని రెస్క్యూ సిబ్బంది గుర్తు చేసుకున్నారు. -
మనిషి రూపంలో దూడ.. విష్ణు మూర్తేనంటూ..
చూడటానికి మనిషి ముఖంలా కనిపిస్తున్న ఆకారంతో జన్మించిన ఆవు దూడకు ఓ గ్రామ ప్రజలు పూజలు చేస్తున్నారు. హిందూవులు గోవును ఆరాధిస్తారన్న విషయం తెలిసిందే. అచ్చూ మనిషిలాగే ఉండే చెవులు, ముక్కు, కళ్లతో ఉన్న దూడకు ఓ ఆవు జన్మనిచ్చింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో చోటు చేసుకుంది. మనిషి పోలికలతో ఆవు దూడ జన్మించిన విషయం గ్రామంలో అగ్నిలా వ్యాపించింది. దీంతో జనం తండోపతండాలుగా అక్కడికి చేరుకుని దూడను చూసేందుకు ఎగబడ్డారు. భూమి మీద పడి గంట కూడా గడవక ముందే ఆ లేగ దూడ మరణించింది. ఆరెంజ్ కలర్ దుప్పటిపై లేగ దూడ కళేబరాన్ని ఉంచి దండలు వేసి పూజలు చేశారు. చనిపోయిన దూడను చూడాటానికి వచ్చిన వారిలో ఓ వ్యక్తి విష్ణువే దూడ రూపంలో జన్మించాడని అన్నాడు. దేవుడి ఆశీస్సులు తీసుకునేందుకే తాను ఇక్కడికి వచ్చానని చెప్పాడు. కాగా, మనిషి పోలీకలతో దూడ జన్మించడంపై మాట్లాడిన తల్లి ఆవు యజమాని రాజా మిశ్రా.. తమ కొట్టంలో ఈ ఘటన జరగడం ఆ దేవుడి మాపై ఉందనడానికి నిదర్శనమని అన్నాడు. మూడు రోజుల్లో మరణించిన దూడకు అంత్యక్రియలు పూర్తి చేస్తామని చెప్పాడు. త్వరలో దూడకు ఓ గుడి కూడా కట్టిస్తామని తెలిపాడు. దేవుడి ఎంచుకున్న ఈ రూపం చాలా మందిలో భక్తి భావాన్ని మరింత పెంపొందించిందని అన్నాడు. కాగా, ఈ ఘటనపై స్పందించిన జంతు నిపుణులు దాని చుట్టూ అల్లుతున్నవి మూఢ నమ్మకాలని కొట్టిపారేశారు. -
ఆన్లైన్లో చేప హల్చల్
బీజింగ్: సెంట్రల్ చైనాలోని హునన్ ప్రావిన్స్‌లో వుగంగ్ సిటీలో ఓ అరుదైన చేప అందరినీ ఆకర్షిస్తోంది. ఈ చేప తల భాగం మనిషి ముఖాన్ని పోలి వింతగా కనిపిస్తోంది. నలుపు, గోధుమ రంగుల్లో ఉన్న ఈ చేప 36 సెంటీ మీటర్ల పొడవు, 800 గ్రాముల బరువు ఉంది. విశేషమేంటంటే ఈ చేప కళ్లు, నోరు, ముక్కుభాగం మనిషికి ఉన్నట్టే ఉన్నాయి. ఈ చేప ఫొటోలు చైనా ఇంటర్నెట్ ప్లాట్‌ఫామ్స్‌లో వైరల్ అవుతోంది. వుగంగ్ సిటీలో నివసిస్తున్న క్వియు ఝియోహ్వా అనే ఎలిమెంటరీ స్కూల్ టీచర్ ఈ అరుదైన చేపను గత ఏప్రిల్ 30న ఓ రిజర్వాయర్‌లో పట్టుకున్నాడు. క్వియు గత 20 ఏళ్లుగా చేపల వేటకు వెళ్తున్నా, తొలిసారి ఇలాంటి అరుదైన చేప దొరికింది. ఆయన తన ఇంట్లో దీన్ని పెంచుకుంటున్నాడు. ఇలాంటి చేపలు ఉండటం చాలా అరుదైన చైనా మీడియా వార్తలు ప్రచురించింది. 2010లో ఇలాంటి చేప ఉన్నట్టు ఇంగ్లండ్ మీడియా వెల్లడించింది. ఈ చేపను కొనుగోలు చేసేందుకు యజమానికి 40 వేల ఫౌండ్లను ఆఫర్ చేశారని పేర్కొంది.


