ఏముందిరా బుల్‌బుల్.. | Facial | Sakshi
Sakshi News home page

ఏముందిరా బుల్‌బుల్..

Aug 19 2014 3:24 AM | Updated on Sep 2 2017 12:04 PM

ఏముందిరా బుల్‌బుల్..

ఏముందిరా బుల్‌బుల్..

ఈ క్రీం వాడండి.. మీ వయసు ఓ పదేళ్లు తగ్గిపోతుంది.. లేదా ఈ ఫేషియల్ చేయించుకోండి మీరు అరవైలో ఇరవైలా కనిపిస్తారు వంటి యాడ్స్ మనమెన్నో చూశాం

ఈ క్రీం వాడండి.. మీ వయసు ఓ పదేళ్లు తగ్గిపోతుంది.. లేదా ఈ ఫేషియల్ చేయించుకోండి మీరు అరవైలో ఇరవైలా కనిపిస్తారు వంటి యాడ్స్ మనమెన్నో చూశాం.. వయసు తగ్గుతుందంటే చాలు.. ఎంత డబ్బు పెట్టడానికైనా సిద్ధపడిపోతాం.. ఇది చివరకు ఎంత వరకూ వెళ్లిందంటే.. పక్షుల రెట్టలను కూడా పులిమేసుకునేంత వరకూ.. ఇక్కడ జరుగుతోంది కూడా అదే. ఈ పక్షి పేరు నైటింగేల్.. మన దగ్గర బుల్‌బుల్ పిట్ట అని అంటారు.. అయితే.. జపాన్‌లో నైటింగేల్‌లోని ఓ అరుదైన రకం పక్షి ఉంది. దాని రెట్టను రాసుకుంటే.. వయసు తగ్గినట్లు కనిపిస్తుందని.. మొటిమల వల్ల ముఖంపై వచ్చే మచ్చలను అది తొలగిస్తుందన్నది జపానోళ్ల విశ్వాసం. అక్కడ 17వ శతాబ్దంలోనే ఈ నైటింగేల్ ఫేషియల్ ఫేమస్.

తర్వాత అది ఆ నోటా ఈ నోటా పాకి.. విదేశాలకూ చేరింది. ఈ ఫేషియల్ అంటే పడి చచ్చే జాబితాలో హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్, విక్టోరియా బెక్‌హాం వంటి వారూ చేరారు. ఓ సారి పులుముకుంటే రూ.20 వేలు సమర్పించుకోవాల్సిందే. ఎందుకింత ధర అంటే.. జపాన్‌లో స్థానిక నైటింగేల్ పిట్టలు తగ్గిపోతుండటంతో దాని రెట్టకూ డిమాండ్ పెరిగింది. పైగా.. నైటింగేల్‌ను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. దానికి ఏది పడితే అది పెట్టరు. పళ్లు లాంటి మంచి ఫుడ్ మాత్రమే పెడతారు. పురుగులు తినడం నిషిద్ధం. ఇంత మంచి ఫుడ్ తినడం వల్ల వచ్చే మంచి రెట్టతో ఎంతో మంచి జరిగిపోతుందట. దాన్ని పౌడర్ కింద మార్చి.. మరికొన్ని పదార్థాలు కలిపి.. ఫేషియల్ చేస్తారు. ఈ ఫేషియల్‌కు మంచి డిమాండ్ ఉంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement