25వ అంతస్తు నుంచి దూ​కేసిన ప్లేబాయ్‌ మోడల్‌ | Ex-Playboy Model, Child Die After Falling Out Of Manhattan Hotel | Sakshi
Sakshi News home page

25వ అంతస్తు నుంచి దూ​కేసిన ప్లేబాయ్‌ మోడల్‌

May 19 2018 7:41 PM | Updated on Nov 6 2018 8:16 PM

Ex-Playboy Model, Child Die After Falling Out Of Manhattan Hotel - Sakshi

మాజీ ప్లేబాయ్‌ మోడల్‌, రచయిత స్టెఫానీ ఆడమ్స్

న్యూయార్క్‌ : మరో హృదయ విదారకర ఘటన చోటుచేసుకుంది. మాజీ ప్లేబాయ్‌ మోడల్‌, రచయిత స్టెఫానీ ఆడమ్స్ తన ఏడేళ్ల కొడుకుతో కలిసి 25వ అంతస్తు నుంచి దూకి చనిపోయారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు మిడ్‌టైన్‌ మాన్హాటన్‌లోని గౌతమ్‌ హోటల్‌ పై నుంచి దూకి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. 25వ అంతస్తు పెంట్‌హౌజ్‌ నుంచి కొడుకుతో పాటు దూకిన స్టెఫానీ, రెండో ఫ్లోర్‌లో తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడిపోయినట్టు అక్కడి పోలీస్‌ అధికారులు చెప్పారు. అయితే ఇది ఆత్మహత్యనా? హత్యనా? లేదా ప్రమాదవశాత్తు జరిగిందా? అనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. హోటల్‌ మేనేజ్‌మెంట్‌ దీనిపై స్పందించడానికి నిరాకరించింది. 

స్టెఫానీ తన భర్త చార్లెస్ నికోలైతో విడిపోయారు. కొన్ని నెలల క్రితమే వారు విడిపోయినట్టు ఆడమ్స్‌ తరుఫున విడాకుల కేసు వాదించిన న్యాయవాది తెలిపారు. అయితే ఆమెను డిప్రెషన్‌ వెన్నాడటం లేదని, కానీ కొన్ని సమస్యలతో ఆమెను ఇటీవల ఊపిరి పీల్చుకోనియకుండా చేస్తున్నాయని చెప్పారు. దీనిలో సమస్యలతో పాటు డిప్రెషన్‌ కూడా ఒక కారణమని పేర్కొన్నారు. ఆమె అంత మంచి వ్యక్తిని(స్వీటెస్ట్‌ పర్సన్‌‌) ఇప్పటి వరకు తాను కలువలేదని తెలిపారు. ఆడమ్స్‌ ప్లే బాయ్స్‌ ‘మిస్‌ నవంబర్‌’గా 1992లో నిలిచారు. ఆమెకు రెండు బిజినెస్‌ డిగ్రీలున్నాయి. పలు పుస్తకాలను కూడా రాశారు. ఆన్‌లైన్‌ బ్యూటీ ప్రొడక్ట్‌ల కంపెనీ నిర్వహించారు. తన భర్త ఆఫీసులో ఆమె ఆర్థిక వ్యవహారాలు చూసుకునే వారు. కానీ కొన్ని నెలల క్రితమే ఈ ఇరువురు విడిపోయారు.     

1
1/1

కొడుకుతో స్టెఫానీ ఆడమ్స్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement