టర్కీ సెంట్రల్‌ బ్యాంకు గవర్నర్‌పై వేటు

Erdogan Ousts Central Bank Chief Who Drew Ire for Holding Rates - Sakshi

అంకారా : టర్కీ అధ్యక్షుడు రిసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగాన్‌  సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశ కేంద్ర బ్యాంకు గవర్నరు మురాత్ సెటింకాయను అనూహ్యంగా పదవినుంచి తప్పించారు. ఆయన స్థానంలో  డిప్యూటీ గవర్నర్‌  మురత్ ఉయిసాల్‌ ను నియమించారు. ఈ మేరకు శనివారం అధికారిక గెజిట్‌ను  ఉటంకిస్లూ బ్లూం బర్గ్‌   నివేదించింది.  ప్రభుత్వానికి, కేంద్ర బ్యాంకు గవర్నకు మధ్య నెలకొన్నవివాదం జూన్‌ 12 నాటిపాలసీ రివ్యూ తరువాత మరింత ముదిరింది. కీలక వడ్డీరేట్ల యథాతథం నిర్ణయం  చివరికి గవర్నర్‌ ఉద్వాసనకు దారితీసిందని  భావిస్తున్నారు. ఈ నిర్ణయం అక్కడి మార్కెట్లను భారీగా ప్రభావితం చేసింది.  దేశంలో ద్రవ్యోల్బణం ఊహించిన దానికంటే  కిందికి దిగజారిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.  టర్కీ  ప్రస్తుత వాస్తవ రేటు 8.3 శాతానికి చేరుకున్న కొద్ది రోజుల తరువాత ఈ నిర్ణయం తీసుకుంది.  

సెంట్రల్ బ్యాంక్ విశ్వసనీయతను అణగదొక్కడానికి ఈ నిర్ణయం తీసుకున్నారని  లండన్ కు చెందిన వ్యూహకర్త పియోటర్ మాటిస్ అభిప్రాయపడ్డారు. తాజా నిర్ణయం డబుల్ డిప్ మాంద్య ప్రమాదాన్ని పెంచుతుందన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో మొదటిసారిగా పారిశ్రామిక ఉత్పత్తి  పడిపోయింది. సెంట్రల్‌ బ్యాంకు  తదుపరి విధాన నిర్ణయం జూలై 25 న జరగాల్సి ఉంది.  మురాత్ నాలుగేళ్ల పదవీకాలం 2020లో  ముగియనుంది.

టర్కీ ఆర్థిక వ్యవస్థ ఇటీవల తిరిగి మాంద్యంలోకి జారుకుంది. దశాబ్దకాలం తర్వాత మరోసారి మాంద్యంలోకి పడిపోవడం సర్వత్రా ఆందోళ రేపింది. దేశ ఆర్థిక వ్యవస్థలో వృద్ధితోపాటు ద్రవ్యోల్బణం వంటి అంశాలు దేశ అధ్యక్షుడు రెసెప్‌ తెయిప్‌ ఎర్డోగాన్‌ ప్రభుత్వానికి సవాలుగా మారనున్నాయని ఆర్థిక వేత్తలు అంచనావేశారు. గత ఏడాదిలో డాలర్‌ మారకంలో టర్కీ కరెన్సీ లిరా 30 శాతం మేర క్షీణించింది. ఫలితంగా విదేశాల నుంచి దిగుమతులు మరింత భారమైన సంగతి తెలిసిందే.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top