అప్పుడు గుండె కొట్టుకోవడం పెరిగిందో.. ఆగిపోయిందో !

Elephant comes too close.. a man struck like a statue

ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కలిసి ఓ టాప్‌లెస్‌ జీపులో పెద్ద పెద్ద కెమెరాలతో వన్యమృగాల సందర్శనకు బయలుదేరి వెళ్లారు. దుమ్మురేగే మట్టి రోడ్డులో ఓ గైడ్‌తో కలిసి వన్యమృగాలను చూస్తున్నారు. ఆ అడవిలో ఏనుగులు చాలా ఫేమస్‌.. ఎక్కడ చూసినా అవే కనిపిస్తుంటాయి. సహజంగా బెదిరించినంత వరకు ఏనుగులు ఏమీ చేయవు.. అలాగని అదే నిర్ణయంతో వాటికి దగ్గరగా ఉండటం ఏమాత్రం శ్రేయస్కరం కాదు.. కానీ, ఆ ఒక్క పాయింట్‌ మీదనే ముందుకెళ్లిన వారంతా వీడియో కెమెరాలను సిద్ధంగా ఉంచుకొని అడవిలో తమ రోడ్డుపక్కనే తిరుగుతున్న ఏనుగుల గుంపు వద్దకు వెళ్లి వాటి కదలికలను రికార్డు చేయాలనుకున్నారు.

అయితే, అనుకోకుండా అవి వేరే మార్గం వైపు వెళ్లినట్లు వెళ్లగా అందులో పెద్ద దంతాలతో ఉన్న ఏనుగు మాత్రం నేరుగా వారి వైపే వచ్చింది. ఆ సమయంలో జీపు ముందు భాగంలో బానెట్‌పై అమర్చి ఉంచిన కుర్చిలో గైడ్‌ కూర్చొని ఉన్నాడు. ఆ సమయంలో వారు ఏ మాత్రం గందరగోళం చేసి ఆ ఏనుగు వారిని కుమ్మేస్తుంది. కానీ వారంతా కెమెరాలను మాత్రం యాక్టివ్‌లో పెట్టి వారంతా కుక్కిన పేనులా కదలకుండా కూర్చుండి పోయారు. ఆ సమయంలో దగ్గరకు వచ్చిన ఏనుగు కుర్చీలో కూర్చున్న వ్యక్తిని తొండంతో తాకి, దంతంతో కదిలించి కాసేపు వారిని అలాగే చూసి వారి నుంచి ఎలాంటి రియాక్షన్‌ లేకపోవడంతో సావధానంగా వెళ్లిపోయింది. ఈ వీడియో చూసిన వాళ్లందరికే గుండె ఆగిపోయే పని అవుతుంటే ఏకంగా ఏనుగును అంతసమీపంగా ఎదుర్కొన్న ఆ వ్యక్తికి అసలు ఎన్ని గుండెలో అని నెటిజన్లు అనుకుంటున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top