ఫుట్బాల్ స్టేడియంలో ఘర్షణ, 30మంది మృతి | Egypt suspends football league after deadly clashes | Sakshi
Sakshi News home page

ఫుట్బాల్ స్టేడియంలో ఘర్షణ, 30మంది మృతి

Feb 9 2015 8:14 AM | Updated on Oct 2 2018 8:39 PM

ఫుట్బాల్ స్టేడియంలో ఘర్షణ, 30మంది మృతి - Sakshi

ఫుట్బాల్ స్టేడియంలో ఘర్షణ, 30మంది మృతి

ఈజిప్ట్లోని కైరో ఎయిర్ డిఫెన్స్ ఫుట్బాల్ స్టేడియంలో వద్ద ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సంఘటనలో 25మంది మృతి చెందగా, ...

కైరో : ఈజిప్ట్లోని కైరో ఎయిర్ డిఫెన్స్ ఫుట్బాల్ స్టేడియంలో వద్ద ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సంఘటనలో సుమారు 30మంది మృతి చెందగా, 30మంది గాయపడ్డారు. అభిమానులు, భద్రతా దళాల మధ్య ఘర్షణ జరిగింది. లీగ్ క్లబ్ జమేలక్, ఈఎన్పీపీఐ మధ్య మ్యాచ్ సందర్భంగా టికెట్లు లేకుండా వచ్చిన 10 వేల మంది అభిమానులను భద్రతా దళాలు అడ్డుకోవడంతో ఘర్షణ చోటుచేసుకుంది. అభిమానులు భద్రతాదళాలపై తిరగబడ్డారు.

దాంతో ఒక్కసారిగా ఘర్షణ చోటుచేసుకోవటంతో పోలీసులు కాల్పులు జరిపారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు  ఘర్షణల అనంతరం ఫుట్బాల్ అభిమానులు విధ్వంసానికి దిగారు. పలు వాహనాలకు నిప్పు అంటించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement