ఈజిప్టులో 529 మందికి మరణశిక్ష | Egypt sentences to death 529 supporters of Mohamed Morsi | Sakshi
Sakshi News home page

ఈజిప్టులో 529 మందికి మరణశిక్ష

Mar 25 2014 3:24 AM | Updated on Sep 2 2017 5:07 AM

ఈజిప్టు పదవీచ్యుత అధ్యక్షుడు మహమ్మద్ మోర్సీ మద్దతుదారుల్లో 529 మందికి మనియాలోని ఓ కోర్టు సోమవారం మరణశిక్ష విధించింది.

కైరో: ఈజిప్టు పదవీచ్యుత అధ్యక్షుడు మహమ్మద్ మోర్సీ మద్దతుదారుల్లో 529 మందికి మనియాలోని ఓ కోర్టు సోమవారం మరణశిక్ష విధించింది. ముస్లిం బ్రదర్‌హుడ్‌కు చెందిన వీరిని ఓ పోలీసు అధికారి హత్య కేసు, ప్రజలపై దాడుల కేసుల్లో దోషులుగా నిర్ధారించి శిక్ష వేసింది. ఆధునిక ఈజిప్టు చరిత్రలో ఇంతమందికి మరణదండన విధించడం ఇదే తొలిసారని భావిస్తున్నారు. కోర్టు తీర్పుపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement