అసాంజేకు నెట్ ను కట్ చేసింది మేమే : ఈక్వెడార్ | Ecuador Cuts Internet Access for Julian Assange to Preserve Neutrality in U.S. Election | Sakshi
Sakshi News home page

అసాంజేకు నెట్ ను కట్ చేసింది మేమే : ఈక్వెడార్

Oct 20 2016 2:15 AM | Updated on Sep 4 2017 5:42 PM

అసాంజేకు నెట్ ను కట్ చేసింది మేమే : ఈక్వెడార్

అసాంజేకు నెట్ ను కట్ చేసింది మేమే : ఈక్వెడార్

వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకు ఇంటర్‌నెట్ సదుపాయాన్ని నిలిపేసినట్లు ఈక్వెడార్ తెలిపింది.

క్విటో: వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకు ఇంటర్‌నెట్ సదుపాయాన్ని నిలిపేసినట్లు ఈక్వెడార్ తెలిపింది. అమెరికా ఎన్నికల్లో అంతరాయాలు సృష్టించకుండా ఆంక్షలు విధించినట్లు తెలిపింది. ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదన్న సూత్రాన్ని పాటిస్తామంది.  విదేశీ ఎన్నికల్లో జోక్యం చేసుకోవడం గాని, ప్రత్యేకించి ఓ అభ్యర్థివైపు మొగ్గు చూపడం గాని తమ అభిమతానికి విరుద్ధమని ఈక్వెడార్ విదేశాంగ మంత్రి తెలిపారు. అసాంజే విడుదల చేసిన పలు పత్రాలు అమెరికా ఎన్నికలపై ప్రభావం చూపొచ్చని  అందుకే అసాంజేకు కమ్యూనికేషన్ వ్యవస్థ నిలిపేశామన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement