దుబాయ్‌ ఎయిర్‌పోర్టులో అదనపు చార్జీలు

Dubai Airport Announces New Fees For Baggage Handling - Sakshi

దుబాయ్‌ : అంతర్జాతీయ షాపింగ్‌ మాల్‌గా పేరున్న దుబాయ్‌కి ప్రపంచ దేశాల నుంచి పెద్ద ఎత్తున సందర్శకులు వస్తుంటారు. మరి అలాంటి అత్యంత రద్దీగల దేశంలో ఉన్న దుబాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణికుల రద్దీ కూడా ఎక్కువగానే ఉంటుంది. దుబాయ్‌ ఎయిర్‌పోర్టు నుంచి ప్రయాణించే వారి జేబులకు చిల్లులు పేట్టేందుకు విమానాశ్రయ అధికారులు సిద్ధమవుతున్నారు. చేతిలో ఉన్న బ్యాగుల బరువు ఆధారంగా అదనపు చార్జీలను వసూలు చేయనున్నట్టు ఎయిర్‌పోర్టు అథారిటీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.

విమానాలలో ప్రయాణించే వారు కొంత లగేజ్‌ను(హ్యాండ్‌ బ్యాగ్‌లు, చిన్నపాటి సూట్‌కేసులు) తమతో పాటు తీసుకుని వెళ్తారు. సాధారణంగా వాటికి ఎటువంటి చార్జీలు ఉండవు. కానీ దుబాయ్‌ ఎయిర్‌ పోర్టులో చేతిలో తీసుకువెళ్లే లగేజ్‌కు అదనపు చార్జీని వసూలు చేయనున్నారు. అయితే, లగేజ్‌ ఎంత బరువు ఉండాలి, ఎంత మొత్తంలో ఫీజును వడ్డించనున్నారో ఇంకా స్పష్టంగా పేర్కొనలేదు. అదనపు ఫీజు మాత్రం ఉంటుందని ప్రకటించారు. మరిన్ని వివరాల కోసం ప్రయాణికులు తమ తమ క్యారియర్స్‌ వెబ్‌సైట్‌ను చూడాల్సిందిగా ఎయిర్‌పోర్టు అధికారులు సూచించారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top