తాగి.. జిరాఫీతో గేమ్స్‌.. తగిన శాస్తి జరిగింది!

Drunk Man Climbs And Rides on Giraffe in Kazakhstan Zoo - Sakshi

ఎవరైనా జూపార్కుకు వెళితే.. అక్కడి జంతువులను చూసి.. వాటితో కాసేపు సరదాగా గడిపి వస్తారు. కానీ, ఓ వ్యక్తి మాత్రం తాగిన మైకంలో జూపార్కులో హల్‌చల్‌ చేశాడు. జిరాఫీ ఉన్న బోను దగ్గరికి వెళ్లి.. అది ఫెన్సింగ్‌ సమీపంలోకి రాగానే.. అమాంతం దానిపైకెక్కి కూర్చొని.. కాసేపు అటు-ఇటు స్వారీ చేశాడు. మొదటిసారి జిరాఫీ కొంచెం మృదువుగా వ్యవహరించి.. అతన్ని కిందికి విదిలించింది. అయినా, తాగిన మైకంలో ఉన్న సదరు వ్యక్తికి జిరాఫీపై మీద ఊరేగాలన్నా కోరిక తీరలేదేమో.. ఫెన్సింగ్‌ సాయంతో మరోసారి ఇదే దుస్సాహసానికి అతడు ఒడిగట్టాడు. జిరాఫీ మీద కూర్చొని.. స్వారీ చేయాలని చూశాడు. ఈసారి జిరాఫీ సదరు వ్యక్తిని గట్టిగా విదిలించి దభేల్న పడేలా చేసింది. దెబ్బకు మైకం నుంచి తేరుకున్న ఆ ఆకతాయి.. బతుకు జీవుడా అనుకుంటూ.. ఫెన్సింగ్‌ను ఎక్కి అక్కడినుంచి బయటపడ్డారు. ఒకింత సరదాగా, మరొకింత వికృతంగా ఉన్న ఈ ఘటన కజకిస్థాన్‌లోని స్కైమెట్‌ జూలో చోటుచేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ జూలో జిరాఫీపై స్వారీ చేసేందుకు ప్రయత్నించి.. ఆకతాయి కిందపడిపోయిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. సదరు దుండగుడిని పట్టుకొని తగిన శాస్తి చేసేందుకు ఇటు జూ అధికారులూ ప్రస్తుతం ప్రయత్నిస్తున్నారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top