డొనాల్డ్ ట్రంప్ హ్యాట్రిక్ విజయం | Sakshi
Sakshi News home page

డొనాల్డ్ ట్రంప్ హ్యాట్రిక్ విజయం

Published Thu, Feb 25 2016 3:48 AM

డొనాల్డ్ ట్రంప్ హ్యాట్రిక్ విజయం - Sakshi

భారతీయులను ఉద్యోగాల నుంచి తొలగిస్తానని వ్యాఖ్య
లాస్ వెగాస్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ దూసుకెళ్తున్నారు. నెవేడా కాకస్ రాష్ట్రంలో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఇప్పటివరకు జరిగిన నాలుగు ప్రైమరీల్లో మూడింటిని ట్రంప్ కైవసం చేసుకుని హ్యాట్రిక్ సాధించారు. సౌత్ కరోలినా, న్యూ హాంప్‌షైర్, నెవేడాలలో ట్రంప్ ముందంజలో ఉండగా.. అయోవా కాకస్‌లో మాత్రం ట్రంప్‌ను రెండో స్థానంలోకి నెట్టి క్రుజ్ గెలిచారు.  
 
భారతీయుల ఉద్యోగాలకు ఎసరు
భారత్, చైనా లాంటి దేశాల నుంచి వచ్చిన వారు అమెరికాలో ఉద్యోగాలు కొల్లగొడుతున్నారని ట్రంప్ ఆరోపించారు. తాను గెలిస్తే అమెరికాలోని భారతీయులను ఉద్యోగాల నుంచి తొలగిస్తానని లాస్‌వెగాస్ ర్యాలీలో అన్నారు. కాగా, తాను గెలిస్తే, తన ప్రత్యర్థి హిల్లరీపై విచారణ జరిపిస్తానని వెల్లడించారు. ఆమె స్టేట్ సెక్రటరీగా ఉన్నప్పుడు ప్రైవేట్ ఈమెయిల్ సర్వర్ ఉపయోగించడంపై విచారణ జరిపిస్తానన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement