వైరల్‌: కుక్క నోటి నుంచి కక్కించారు | Dog Swallows Engagement Ring In South Africa | Sakshi
Sakshi News home page

నిశ్చితార్థపు ఉంగరం మింగిన కుక్క

Feb 9 2020 2:56 PM | Updated on Feb 9 2020 3:18 PM

Dog Swallows Engagement Ring In South Africa - Sakshi

కేప్‌టౌన్‌: ధగధగ మెరిసిపోతున్న ఉంగరాన్ని చూసి అదేదో కొత్తరకం ఆహారం అనుకుందో ఏమో ఆ కుక్క. వెంటనే లటుక్కున నోట్లో వేసుకుంది. ఇది గమనించిన యజమానురాలి గుండెలదిరిపోయాయి. వెంటనే దాన్ని చంకనేసుకుని ఆసుపత్రికి పరుగు పెట్టింది. ఎందుకంటే అది మామూలు ఉంగరం కాదు.. ఎంతో ఖరీదు చేసే నిశ్చితార్థపు ఉంగరం. అయితే ఆసుపత్రి వాళ్లు కుక్క కడుపులో నుంచి చాకచక్యంగా ఉంగరాన్ని బయటికి తీశారు. ఈ అరుదైన ఘటన దక్షిణాఫ్రికాలో జరిగింది. పొరపాటున మింగిన ఉంగరాన్ని బయటకు తీయడం కోసం యజమానురాలు ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న పెప్పర్‌(కుక్క)కు కృత్రిమ వాంతులు చేయించారు వైద్యులు.

తద్వారా దాని నోటి నుంచి రింగ్‌ను బయటకు కక్కించారు. దీంతో కుక్క కాస్త సుస్తీ పడ్డట్లు కనిపించినా దాని ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదని వైద్యులు చెప్పుకొచ్చారు. ఇక ఈ విషయాన్నంతటినీ ఫొటోలతో సహా ఆసుపత్రి యాజమాన్యం సోషల్‌ మీడియాలో పంచుకుంది. కుక్కను, దాని కడుపులో ఉన్న ఉంగరాన్ని గుర్తించేందుకు తీసిన ఎక్స్‌రేను, ఎట్టకేలకు బయటకు దీసిన ఉంగరం ఫొటోలను పోస్ట్‌ చేసింది. ఈ ఘటనపై నెటిజన్లు స్పందిస్తూ కుక్కపై జాలిపడాలో యజమానురాలికి ఎదురైన అనుభవానికి నవ్వుకోవాలో తెలియడం లేదని అయోమయంలో పడ్డారు.(చదవండి: ప్రపంచంలో మనుషులే భయంకరమైన జంతువులు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement