ఇకపై వారికి నో టోఫెల్‌

Doctors, Nurses Need Not Take TOEFL To Practice in UK - Sakshi

న్యూఢిల్లీ: లండన్‌లో ప్రాక్టీస్‌ చేయాలనుకుంటున్న డాక్టర్లు, నర్సులు, డెంటిస్టులు, ప్రసూతి నిపుణులు వీసా కోసం ఇకపై టోఫెల్, ఐఈఎల్‌టీఎస్‌ వంటి పరీక్షలు రాయాల్సిన అవసరం లేదు. కేవలం ఆక్యుపేషనల్‌ ఇంగ్లిష్‌ టెస్ట్‌ (ఓఈటీ) రాయడం ద్వారా యూకేలో సులువుగా ప్రవేశించవచ్చు. యూకేలోని నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫెరీ కౌన్సిల్, జనరల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ నిర్వహించే ఓఈటీని అభ్యర్థులు రాయాల్సి ఉంటుంది.

టైర్‌–2 వీసా కోసం సంబంధిత ఆరోగ్య సంస్థ నిర్వహించే ఇంగ్లిష్‌ పరీక్ష పాసయితే చాలని యూకే హోం శాఖ తెలిపినట్లు కేంబ్రిడ్జ్‌ బోక్స్‌హిల్‌ లాంగ్వేజ్‌ అసెస్‌మెంట్‌ సీఈఓ సుజాత స్టెడ్‌ తెలిపారు. అక్టోబర్‌ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. వైద్య రంగ నిపుణుల ఆంగ్ల భాషా సామర్థ్యాన్ని పరీక్షించేందుకు అంతర్జాతీయ స్థాయిలో ఓఈటీ నిర్వహిస్తున్నారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top