ఆ హీరో ఆస్కార్ ఒత్తిడిని ఇలా జయించాడు! | DiCaprio took up beekeeping to handle stress | Sakshi
Sakshi News home page

ఆ హీరో ఆస్కార్ ఒత్తిడిని ఇలా జయించాడు!

Mar 4 2016 12:51 PM | Updated on Sep 3 2017 7:00 PM

ఆ హీరో ఆస్కార్ ఒత్తిడిని ఇలా జయించాడు!

ఆ హీరో ఆస్కార్ ఒత్తిడిని ఇలా జయించాడు!

ఓవైపు ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం దగ్గర పడుతోంది. మరోవైపు ఆరుసార్లు నామినేట్ ..

లాస్ఏంజిల్స్: ఓవైపు ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం దగ్గర పడుతోంది. మరోవైపు ఆరుసార్లు నామినేట్ అయిన తమ అభిమాన హీరో ఈ సారైనా ఆస్కార్ గెలుస్తాడా అని ప్రపంచవ్యాప్తంగా అభిమానుల కళ్లన్నీ ఆయనపైనే. ఈ నేపథ్యంలో మరి ఆ హీరోపై ఎంత ఒత్తిడి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎట్టకేలకు రెవనాంట్ చిత్రంలో నటనకు గాను ఉత్తమ నటుడి అవార్డ్ అందుకున్న లియోనార్డో డికాప్రియో ఆస్కార్ ఒత్తిడిని ఎలా అధిగమించాడు అనే అంశంపై ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.

88వ ఆస్కార్ అవార్డుల సందర్భంగా తాను ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కోకుండా ఉండటానికి లియోనార్డో డికాప్రియో పెద్ద కసరత్తే చేశాడట. అదే తేనెటీగలతో సావాసం. అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం దగ్గర పడుతున్న కొద్దీ.. పెరుగుతున్న ఒత్తిడిని దూరం చేయటానికి డికాప్రియోకు ఆయన తల్లి స్నేహితుడు డేవిడ్ సహాయం చేశాడు. స్వతహాగా తేనెటీగల పెంపకంలో మంచి అనుభవం ఉన్నవాడు అయిన డేవిడ్.. డికాప్రియోను ఆ పనిలో మునిగిపోయేలా చేశాడట. తేనెటీగలను పెంచుతూ మన హీరో మిగతా విషయాల గురించి ఆలోచించలేదట. దీని ద్వారా అవార్డుల కార్యక్రమానికి ముందుగా డికాప్రియో ఎలాంటి ఒత్తిడి ఎదుర్కోకుండా ఉన్నాడని మీడియా సంస్థ మిర్రర్ వెల్లడించింది.

 

Advertisement
 
Advertisement
Advertisement